యువకుని శరీరంలో గర్భాశయం.. ఖంగుతిన్న డాక్టర్లు

ఇదో వింతల ప్రపంచం. ఎక్కడో ఓ చోట ఏదో ఒక వింత బయటపడుతూనే ఉంటుంది. తాజాగా ముంబైలో ఓ పురుషుడిలో గర్భాశయం వెలుగుచూసింది. ఇది వైద్య చరిత్రలోనే ఇది అరుదైన ఘటనగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ముంబైలో  29 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి సంతానం కలగలేదు. అయితే ఆ యువకుడు జేజే హాస్పిటల్‌లో వైద్య పరీక్షలుచేయించుకున్నాడు. అక్కడ  డాక్టర్లకు ఆశ్యర్యపోయే దృశ్యం కనిపించింది.  ఆ యువకుడి శరీరంలో గర్భసంచి, అండాశయాలు ఉన్నట్టుగా పరీక్షల్లో […]

యువకుని శరీరంలో గర్భాశయం.. ఖంగుతిన్న డాక్టర్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 14, 2019 | 6:52 AM

ఇదో వింతల ప్రపంచం. ఎక్కడో ఓ చోట ఏదో ఒక వింత బయటపడుతూనే ఉంటుంది. తాజాగా ముంబైలో ఓ పురుషుడిలో గర్భాశయం వెలుగుచూసింది. ఇది వైద్య చరిత్రలోనే ఇది అరుదైన ఘటనగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ముంబైలో  29 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి సంతానం కలగలేదు. అయితే ఆ యువకుడు జేజే హాస్పిటల్‌లో వైద్య పరీక్షలుచేయించుకున్నాడు. అక్కడ  డాక్టర్లకు ఆశ్యర్యపోయే దృశ్యం కనిపించింది.  ఆ యువకుడి శరీరంలో గర్భసంచి, అండాశయాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలడంతో అంతా ఖంగుతిన్నారు. వెంటనే  సర్జరీ చేసి ఆ యువకుని శరీరంలో ఉన్న  గర్భాశయాన్ని తొలగించారు.అదేవిధంగా మరో సర్జరీ చేసి అండాశయాలను ఆ యువకుని వృషణాల్లో అమర్చారు.

ఒక పురుషుడి శరీరంలో ఇలాంటి అవయవాలు ఉండటం  వింతైన ఘటనగా చెబుతున్నారు. అయితే  ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 మంది ఇలా గర్భశయాన్నికలిగి ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన ఘటనలు అప్పుడప్పుడూ బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.