40 మంది లేడీ ప్రొఫెసర్లకు డైలీ అసభ్యకరమైన ఫోన్‌కాల్స్
టెక్నాలజీ సాయంతో ఈవ్ టీజింగ్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పోకిరీల అల్లరికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ టీనేజర్ ఏమనుకున్నాడో ఏమోగానీ ఏకంగా 40 మంది లేడీ ప్రొఫెసర్లకు చుక్కలు చూపించాడు. ఈ నలభైమందికి అసభ్యకరమైన కాల్స్ చేస్తూ రోజు విసిగించేవాడు. డైలీ అతడికి ఇదే దినచర్యగా మారిపోయింది. దీంతో తీవ్రంగా విసిగిపోయిన ఓ ప్రొఫెసర్ జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతో కష్టపడి […]
టెక్నాలజీ సాయంతో ఈవ్ టీజింగ్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పోకిరీల అల్లరికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ టీనేజర్ ఏమనుకున్నాడో ఏమోగానీ ఏకంగా 40 మంది లేడీ ప్రొఫెసర్లకు చుక్కలు చూపించాడు. ఈ నలభైమందికి అసభ్యకరమైన కాల్స్ చేస్తూ రోజు విసిగించేవాడు. డైలీ అతడికి ఇదే దినచర్యగా మారిపోయింది. దీంతో తీవ్రంగా విసిగిపోయిన ఓ ప్రొఫెసర్ జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతో కష్టపడి చేసిన విచారణలో పోలీసులు వాడి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు.
హర్యానాలోని హిస్సార్‌కు చెందిన ఓ యువకుడు రాజస్థాన్ యూనివర్సిటీలో తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో యూనివర్సిటీ వైఫై పాస్‌వర్డ్ తెలుసుకుని ఈ పాడుపనికి పూనుకున్నాడు. తనను ఎవ్వరూ గుర్తించకుండా వైఫై ఉపయోగించి కాల్స్ చేసేవాడు. అయితే యూనివర్సిటీ నుంచి నెంబర్లు తీసుకునే మహిళా ప్రొఫెసర్లందరికీ అసభ్యకర పదజాలంతో వేధింపులకు దిగేవాడు. ఈ కేసులో నిందితుణ్ని పట్టుకోవడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. చివరికి ఫోన్‌కాల్స్ వస్తున్న ఐపీ అడ్రస్ ఆధారంగా తీగ లాగారు. ఇంకేముంది మొత్తం డొంక కదిలినట్టుగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు.