రైల్వేను ప్రైవేటీకరణ చేయం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
భారతీయ రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదన్నారు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్. శుక్రవారం ఆయన లోక్‌సభలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వేశాఖపై నిధుల అంశంపై గురువారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన జవాబిచ్చారు. రైల్వేల ఆధునీకరణతో పాటు కొత్త సౌకర్యాలకోసం పెట్టుబడులు అవసరమవుతాయని దానికోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోయల్ చెప్పారు. గతంలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లను తమ రాజకీయ ప్రయోజనాలకోసం, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ […]
భారతీయ రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదన్నారు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్. శుక్రవారం ఆయన లోక్‌సభలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వేశాఖపై నిధుల అంశంపై గురువారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన జవాబిచ్చారు. రైల్వేల ఆధునీకరణతో పాటు కొత్త సౌకర్యాలకోసం పెట్టుబడులు అవసరమవుతాయని దానికోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోయల్ చెప్పారు. గతంలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లను తమ రాజకీయ ప్రయోజనాలకోసం, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో రాయ్‌బరేలీలో మొదటి కోచ్‌ను తయారుచేశామన్నారు. ఇక్కడ ఒక యూనిట్‌ను కార్పొరేటీకరించాలని నిర్ణయించినట్టుగా పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.