పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్న అన్నదాతలు.. రేపు చిల్లా సరిహద్దును పూర్తిగా బ్లాక్‌ చేయనున్న రైతులు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 20 రోజులుగా నిరసనలో పాల్గొంటున్న రైతన్నలు..తమ శాంతియుత పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారే తప్ప, వెనక్కి మాత్రం తగ్గడం లేదు.

పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్న అన్నదాతలు.. రేపు చిల్లా సరిహద్దును పూర్తిగా బ్లాక్‌ చేయనున్న రైతులు
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2020 | 9:49 PM

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 20 రోజులుగా నిరసనలో పాల్గొంటున్న రైతన్నలు..తమ శాంతియుత పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారే తప్ప, వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నారు.  రేపు ఢిల్లీ నోయిడా మధ్య ఉన్న చిల్లా సరిహద్దును పూర్తిగా బ్లాక్‌ చేస్తామని  రైతులు ప్రకటించారు. రైతు నేత జగ్జీత్‌ డాల్లేవాల్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తాము అడుగుతుంటే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు ఈనెల 20న నివాళులర్పించాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో అమరులైన అన్నదాతలకు డిసెంబర్‌ 20న ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు దేశ వ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేశారు.