అయోధ్య రాముడికి విరాళాలు ఇవ్వండి..ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలను కోరిన ఆలయ ట్రస్ట్
వచ్చే నెల 15 నుంచి అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం కోసం విరాళాలను శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర సేకరించనుంది. కోట్లాది మంది రామ భక్తులు ఎలా అయితే రామ జన్మభూమి కోసం పోరాటం చేశారో.. అలాగే రాముడి గుడి నిర్మించడానికి కూడా..
వచ్చే నెల 15 నుంచి అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం కోసం విరాళాలను శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర సేకరించనుంది. కోట్లాది మంది రామ భక్తులు ఎలా అయితే రామ జన్మభూమి కోసం పోరాటం చేశారో.. అలాగే రాముడి గుడి నిర్మించడానికి కూడా సాయం చేయాలని ట్రస్ట్ ఓ ట్వీట్‌లో కోరింది.
దేశవ్యాప్తంగా ఈ విరాళాల సేకరణ ఉంటుందని తెలిపింది. ఈ భారీ ప్రచారంతో కొత్త రామ మందిరానికి చెందిన ఫొటో కూడా దేశంలోని ప్రతి ఇంటికీ చేరుతుందని ట్రస్ట్ చెప్పింది. స్వచ్ఛందంగా రూ.10, రూ.100, రూ.1000 విరాళాలు ఇచ్చేలా కూపన్లను కూడా ఇవ్వనుంది.
దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలలో ఈ ప్రచారం నిర్వహించడానికి ట్రస్ట్ సిద్ధమవుతోంది. ఇందులో విశ్వహిందూ పరిషత్ కీలకపాత్ర పోషించనుంది. 11 లక్షల కుటుంబాలకు చేరడం ద్వారా 55 కోట్ల మంది ప్రజలను ఇందులో భాగం చేయాలని రామ జన్మభూమి ట్రస్ట్ భావిస్తోంది.