AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: ఈనెల 26న ట్రాక్టర్లతో జాతీయ రహదారుల దిగ్బంధం..రైతు సంఘాల పిలుపు

కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం... ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 26న అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. ఇక మార్చి 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపారు.

Farmers Protest: ఈనెల 26న ట్రాక్టర్లతో జాతీయ రహదారుల దిగ్బంధం..రైతు సంఘాల పిలుపు
Tractor Marches Across Highways
Balaraju Goud
|

Updated on: Feb 23, 2024 | 3:42 PM

Share

కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం… ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 26న అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. ఇక మార్చి 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపారు.

మరోవైపు పంబాజ్‌-హర్యానా సరిహద్దుల్లో ఖనౌరి వద్ద చోటుచేసుకున్న రైతు మరణంపై హర్యానా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం బ్లాక్‌ డేగా పాటించాలని రైతులను సంయుక్త కిసాన్ మోర్చా కోరింది. SKM స్వతంత్రంగా తన ఆందోళనను నిర్వహిస్తోందని రాజేవాల్ పేర్కొన్నారు. పంజాబ్, హర్యానాతోపాటు ఇతర రాష్ట్రాల నుండి SKM అనుబంధంగా ఉన్న పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

హర్యానాలోని పలు ప్రాంతాల్లో రైతు సంఘాల ఆందోళన కొనసాగింది. రైతుల ఆందోళన కారణంగా టిక్రి బోర్డర్‌ , శంభు బోర్డర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉద్యయం విజయం సాధించాలంటే శాంతియుతంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు రైతు నేతలు. ఆందోళనను దెబ్బతీసే అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీ మార్చ్‌ శాంతియుతంగానే సాగుతుందని, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఎంఎస్పీపై చట్టం చేస్తే ఆందోళనలు ఉండవన్నారు. రైతులు ఢిల్లీకి మార్చ్‌ చేపట్టేందుకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…