Corona news: నిబంధనలు సడలించడం మంచి పద్ధతి కాదు.. మాస్కులు ధరించడం తప్పనిసరి.. నిపుణుల హెచ్చరిక
దేశంలో కరోనా కేసులు(Corona Cases) తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రాలు నిబంధనలు సడలిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బంగ, తెలంగాణలు మాస్కులు ధరించడం తప్పని సరి కాదని, అది వారి వ్యక్తిగతమని వెల్లడించాయి. అయితే ఈ వైఖరి ఏ మాత్రం...
దేశంలో కరోనా కేసులు(Corona Cases) తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రాలు నిబంధనలు సడలిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బంగ, తెలంగాణలు మాస్కులు ధరించడం తప్పని సరి కాదని, అది వారి వ్యక్తిగతమని వెల్లడించాయి. అయితే ఈ వైఖరి ఏ మాత్రం క్షేమం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో నెల రోజులకు పైగా కొత్త కరోనా కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ.. నాల్గో వేవ్(Fourth Wave) వచ్చే అవకాశం ఉందన్న అధ్యయనాల ప్రకారం అప్రమత్తంగా ఉండాల్సిందేనని వెల్లడించారు. కేసులు మళ్లీ పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ఊహాజనితమే అయినప్పటికీ భవిష్యత్తులో ముప్పు పొంచి ఉంది. మాస్కులు(Masks), భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు అమలు చేస్తే మళ్లీ కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని సీనియర్ వైద్యులు డాక్టర్ ఆదిత్య ఎస్.చౌతీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, మాస్కు కూడా ధరించాల్సిందేనని డాక్టర్ అరుణేష్ కుమార్ అన్నారు.
మరోవైపు.. మాస్కులు ధరించని వ్యక్తులకు జరిమానా విధించకపోవడం మంచి ముందడుగు అని ఢిల్లీలోని పల్మనాలజిస్ట్ డాక్టర్ వినీ కాంత్రూ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను పాటించడం చాలా మంచిది. కానీ ముక్కు కింద, గడ్డం మీదుగా ధరించడం కంటే వేలాడుతున్నట్లు కనిపించాయి. కాబట్టి, ఇది ప్రజలు కేవలం జరిమానాల కోసం వాటిని ధరించినట్లుగా వ్యక్తం అవుతోందని ఆమె అన్నారు. జనాభాలో ఎక్కువ మందికి పూర్తిగా టీకాలు వేయడంతో టీకా ద్వారా గానీ, సహజంగా గానీ రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారని వివరించారు.
Also Read
IPl 2022: లలిత్ యాదవ్ రనౌట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. అసలు ఏం జరిగింది..