AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPl 2022: లలిత్ యాదవ్‌ రనౌట్‌.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. అసలు ఏం జరిగింది..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పుణేలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals), గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) మ్యాచ్‌లో గుజరాత్ 14 తేడాతో విజయం సాధించింది...

IPl 2022: లలిత్ యాదవ్‌ రనౌట్‌.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. అసలు ఏం జరిగింది..
Lalith Yadav
Srinivas Chekkilla
|

Updated on: Apr 03, 2022 | 7:09 AM

Share

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పుణేలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals), గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) మ్యాచ్‌లో గుజరాత్ 14 తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవరల్లో ఆరు వికెట్లో కోల్పోయి 171 పరుగులు చేసింది. ఛేదన ప్రారంభించిన ఢిల్లీ ఐదు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ పంత్‌, లలిత్‌ యాదవ్‌ నిలబడడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. లలిత్‌ రనౌట్‌ అవడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది. అయితే అతను రనౌట్‌ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ విజయ్‌ శంకర్‌ వేశాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతిని పంత్‌ లెగ్‌సైడ్‌ దిశగా ఆడాడు. సింగిల్ కోసం ముందుకు కదిలాడు. కానీ బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో ఆగిపోయాడు. పరుగు కోసం నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న లలిత్ యాదవ్‌ ముందుకు వచ్చి వెనక్కు వెళ్లాడు. కాగా బంతిని అందుకున్న మనోహర్‌.. విజయ్‌ శంకర్‌కు త్రో విసిరాడు. లలిత్‌ యాదవ్‌ క్రీజులోకి చేరేలోపే విజయ్‌ శంకర్‌ వికెట్లను గిరాటేశాడు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బంతి అందుకోవడానికి ముందే విజయ్‌ శంకర్‌ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్‌ కిందపడింది. అప్పటికే బంతి విజయ్‌ శంకర్‌ చేతిలో పడడం.. వెంటనే వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. రిప్లేలో విజయ్‌ శంకర్‌ పొరపాటున ముందే వికెట్లను తన్నినప్పటికి.. లలిత్‌ యాదవ్‌ను రనౌట్‌ చేసే సమయానికి బంతి అతని చేతిలోనే ఉందని.. కాబట్టి అది ఔటేనని ఎంపైర్లు వివరించారు. దీంతో చేసేదేం లేక లలిత్‌ యాదవ్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

Read Also.. GT vs DC Result, IPL 2022: నాలుగు వికెట్లతో చెలరేగిన ఫెర్గూసన్‌.. ఢిల్లీపై గెలిచిన గుజరాత్‌ టైటాన్స్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్