Covid 19 Endemic: కోవిడ్ 19 ఎండెమిక్‌గా మారిపోయింది.. కేసులు తగ్గినా.. పూర్తిగా కనుమరుగైనట్లు కాదు
Covid 19 Endemic: గత రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి అంతం కావడం లేదు. కరోనా కారణంగా ఎంతో మంది బలయ్యారు. ఇప్పుడు థర్డ్‌వేవ్ ముగియబోతోంది. కరోనా..
Covid 19 Endemic: గత రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి అంతం కావడం లేదు. కరోనా కారణంగా ఎంతో మంది బలయ్యారు. ఇప్పుడు థర్డ్‌వేవ్ ముగియబోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పాటు ఇతర ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం కట్టడిలో ఉంది. ఇక యుద్ధప్రతిపాదికన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే చాలా మంది కోవిడ్ టీకాలు వేసుకున్నారు. ఇక కోవిడ్ 19 ఎండెమిక్‌గా మారినట్లు ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ తన సంపాదకీయంలో పేర్కొంది. అయితే కరోనా తగ్గుముఖం పట్టినా.. పూర్తిగా కనుమరుగైందని భావించవద్దని, అది ఎప్పటికీ మనతోనే ఉంటుందని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని, కరోనా నిబంధనలు పాటించకుంటే మరింతగా విజృంభించే అవకాశం ఉందని తెలిపింది. అయితే తీవ్రత మాత్రం సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా మాదిరిగానే ఉంటుందని వెల్లడించింది. రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా ఇతర వ్యాధులపై పరిశోధనలు దెబ్బతిన్నాయని, కోవిడ్ తీవ్రత ముగింపు దశకు వచ్చిందని ఇక నుంచి ఇతర వ్యాధులపై పరిశోధనలు వేగవంతం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.
కోవిడ్ రకరకాల వేరియంట్లతో విజృంభిస్తోంది. ఇక తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం పట్టింది. జనవరి చివరి వారంలోనే 2.2 కోట్ల పాజిటివ్ కేసులు, 59వేల మరణాలు నమోదు అయ్యాయి. అయితే కోవిడ్ టీకా ప్రక్రియ వేగవంతం చేసిన దేశాలలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గిపోయింది. కరోనాతో జీవించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా ఎండెమిక్‌గా మారినంత మాత్రాన తేలికైపోయిందని అనుకోవడానికి అవకాశం లేదని తెలిపింది. అయితే ఎక్కువ మంది కరోనా నుంచి ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మంచి పోషకాలున్న ఆహారాలు తీసుకుంటున్నారని వెల్లడించింది.
రోగి తీవ్రత, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని దీని తీవ్రత సీజనల్ ఇన్‌ఫ్లుయెంజాకు దగ్గరగా ఉంటుంది. కరోనా కారణంగా ఎప్పుడు లేని విధంగా పరిశోధనలు కొనసాగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక 2010-19 మధ్య దశాబ్దకాలంలో బ్రెస్ట్ నియోప్లాసియా, హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్, ఒబెసిటీ, లంగ్ నియోప్లాసియా, టైప్-2 డయాబెటిస్‌పై ఎక్కువగా పరిశోధనలు జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. 2020లో కోవిడ్-19పై చరిత్రలో ఎన్నడూలేని విధంగా 50వేల పరిశోధనపత్రాలు వెలువడ్డాయి. 2021లో ఆ సంఖ్య 78వేలను దాటిపోయింది. 2021 చివరి నాటికి కోవిడ్ యేతర రోగాలపై నాణ్యమైన పరిశోధన కథనాలు తగ్గిపోయినట్లు లాన్సెట్ సంపాదకులు గుర్తించారు. గత రెండు సంవత్సరాలలో కరోనాపై కొనసాగిన పరిశోధనలు మానవజాతి సాధించిన విజయమేనని చెప్పాలి. కోవిడ్ నుంచి రక్షించుకోవాలంటే టీకాలు వేసుకోవడం, జాగ్రత్తలు పాటించడం, చికిత్సులు ఎంతో అవసరం.
ఎండెమిక్ అంటే ఏమిటి..?
2020లో ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ జాకర్ జాన్ ఒక సైన్స్ పేపర్ రాశారు. పరిశోధనల ఆధారంగా ఈ వ్యాధి ఎండెమిక్‌గా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఎండెమిక్ అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితిని ఎండెమిక్ అంటారు. ఎండెమిక్‌గా మారి పూర్తిగా అంతం కాని ఎన్నో వ్యాధులు ఇప్పుడు ప్రజల మధ్యే ఉన్నాయి. అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఎండెమిక్‌గా మారుతాయి. దీని కారణంగా తట్టు, సాధారణ ఫ్లూ, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, మశూచి లాంటి వ్యాధులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: