Watch Video: ఇదేం పనిరా సామి.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు..!
గర్ల్ ఫ్రెండ్ అవసరాలను తీర్చేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు దొంగగా మారాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కొని పారిపోయి పోలీసులకు చిక్కాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిందితుడిని మానస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమాన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

గర్ల్ ఫ్రెండ్ అవసరాలను తీర్చేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు దొంగగా మారాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కొని పారిపోయి పోలీసులకు చిక్కాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిందితుడిని మానస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమాన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. పేరెంట్స్‌ను వదిలేసి అతడు అహ్మదాబాద్‌లో రూ.15వేల జీతానికి జాబ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పిచ్చి ప్రేమలో మునిగిన కొంతమంది ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడతారు. దానివల్ల వారు జీవితాంతం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అలాంటి షాకింగ్ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. ప్రియురాలి ఖరీదైన అభిరుచులను తీర్చేందుకు మానస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుమారుడు దొంగగా మారాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో తదుపరి విచారణ జరుగుతోంది.
ఈ మొత్తం వ్యవహారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందినది. ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు చైన్ స్నాచర్‌గా మారాడు. వీరిని ప్రద్యుమాన్ సింగ్ చంద్రావత్‌గా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మానస అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమాన్ సింగ్. ప్రద్యుమాన్ సింగ్ జనవరి 25 సాయంత్రం ఓ మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టు చేసిన తరువాత, నిందితుడు తన ప్రియురాలి ఖరీదైన అభిరుచులను రూ.15,000 తో తీర్చలేకపోయాడు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వారి మెడలోంచి గొలుసులు లాక్కెళ్లడం మొదలుపెట్టాడు. తాను ఇంటి నుంచి పారిపోయానని, అహ్మదాబాద్‌లో నెలకు రూ.15,000 జీతానికి ఉద్యోగం చేస్తున్నట్లు నిందితుడు ప్రద్యుమాన్ సింగ్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే తనకు వచ్చే రూ.15 వేల జీతంతో ప్రియురాలి అవసరాలు తీర్చలేక నేరం వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వీడియో చూడండి..
మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ 2008లో మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మానస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఉండి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..