AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections 2024: ఎన్నికల సీజన్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ నిఘా

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. పార్టీ, నేతలు ప్రచారంలో హోరెత్తిస్తుంటే.. ఎన్నికల సంఘం తమ విధుల్లో బిజీగా ఉంది. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్న ఈసీ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులపై కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసింది.

Elections 2024: ఎన్నికల సీజన్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ నిఘా
Central Election Commission
Ram Naramaneni
|

Updated on: Apr 15, 2024 | 7:59 PM

Share

ఎన్నికల విధుల్లో ఉద్యోగులది కీలక పాత్ర. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వాళ్లు ఉపయోగించే వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ని ప్రత్యేక బృందాలతో పరిశీలిస్తోంది. గతంలో ఆరోపణలు ఉన్న వారిపై మరింత ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఓ నేతకు అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసినా.. వాటిని ఫార్వర్డ్ చేసినా ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్టుగానే పరిగణిస్తారు. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులదే కీలకపాత్ర. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 1.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీళ్ళలో దాదాపు 90% ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉద్యోగుల్లో 4th క్లాస్ తప్ప అందరికీ ఎన్నికల విధులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వాళ్లంతా పనిచేస్తుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల క్రమంలో వీరికి ప్రత్యేక నియమావళిని ఎన్నికల కమిషన్ జారీ చేసింది. రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని అందులో స్పష్టం చేసింది. ప్రతి రాజకీయ నేత సమావేశం వీడియో చిత్రీకరణ ఉంటుందని.. ఇందులో ఉద్యోగులు ఉన్నట్టు తెలిసినా.. నేతలతో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలతో ఫిర్యాదులు వచ్చినా తక్షణమే సస్పెన్షన్ తప్పదని స్పష్టం చేసింది.

ఎన్నికల కోడ్ లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధన ఉన్నప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. సిద్దిపేటలో ఇటీవల 110 మంది డిఆర్డిఏ ప్రాజెక్టు మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, ఒక రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కమిషన్ సస్పెండ్ చేసింది. సదాశివపేటలో జూనియర్ లెక్చరర్ జాతీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన మీటింగ్‌లో పాల్గొనడం ప్రత్యర్థులు పసికట్టారు. ఈ వీడియోను ఈసీకి అందజేయడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రధానోపాధ్యాయుడు ఓ పార్టీ సమావేశంలో పాల్గొన్న వీడియో బయటికి రావటంతో ఈసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..