ధర్నా ముగిసింది, ఇక విపక్షాల బాయ్ కాట్ !

రాజ్యసభ నుంచి సస్పెండయిన 8 మంది ఎంపీలు మంగళవారం ఉదయం తమ ధర్నా విరమించారు. మిగతాకాలానికి గాను సభా కార్యకలాపాలను బహిష్కరించాలన్న ఇతర విపక్షాల కోర్కె మేరకు వారు తమ నిరసన విరమించారు.

ధర్నా ముగిసింది, ఇక విపక్షాల బాయ్ కాట్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 22, 2020 | 12:55 PM

రాజ్యసభ నుంచి సస్పెండయిన 8 మంది ఎంపీలు మంగళవారం ఉదయం తమ ధర్నా విరమించారు. మిగతాకాలానికి గాను సభా కార్యకలాపాలను బహిష్కరించాలన్న ఇతర విపక్షాల కోర్కె మేరకు వారు తమ నిరసన విరమించారు. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ ను రద్దు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా తక్కువగా  ప్రైవేటు వ్యక్తులు రైతుల నుంచి ఆహారధాన్యాలను కొనకుండా చూసేటట్టు బిల్లు తేవాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. అయితే వీటి డిమాండును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు.  దీంతో కాంగ్రెస్, ఆప్,  తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తరువాత ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ,  ఆర్జేడీ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. కాగా-సభను బాయ్ కాట్ చేయాలన్న నిర్ణయంపై ప్రతిపక్షాలు పునరాలోచించాలని వెంకయ్యనాయుడు కోరారు.

Latest Articles