AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌషంబి జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జరిగిన ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డుపై ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చింది. దేవిగంజ్‌ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు
Balaraju Goud
|

Updated on: Dec 02, 2020 | 10:43 AM

Share

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌషంబి జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జరిగిన ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డుపై ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చింది. దేవిగంజ్‌ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్దరు కారులోనే చిక్కుకుపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో స్కార్పియో వాహ‌నంలో 10 మంది ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వివాహ వేడుక‌కు హాజ‌రై తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘోరం జ‌రిగింది. స్కార్పియోలో చిక్కుకున్నవారిని బయటకుతీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్లు, గ్యాస్‌ కట్టర్ల సాయంతో బయటకుతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారంతా బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు.

Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు