Chandan Mitra: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎంపీ చందన్ మిత్రా కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 02, 2021 | 1:50 PM

సీనియర్‌ జర‍్నలిస్ట్‌, మాజీ పార్లమెంటు సభ్యులు చందన్ మిత్రా (65) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

Chandan Mitra: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎంపీ చందన్ మిత్రా కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ
Editor And Former Rajya Sabha Mp Chandan Mitra

Editor And Former MP Chandan Mitra: సీనియర్‌ జర‍్నలిస్ట్‌, మాజీ పార్లమెంటు సభ్యులు చందన్ మిత్రా (65) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్‌ ద్వారా ఈ విషయానని వెల్లడించారు. “నాన్న అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు” అని తన కుమారుడు కుషన్ మిత్రా ట్వీట్ చేశారు.

చందన్ మిత్రా రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగాగా పని చేశారు. ది పయనీర్ వార్తాపత్రిక సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. చందన్‌ మిత్రా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఎడిటర్, పొలిటీషియన్ అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక‍్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.

అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్‌ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్‌ మిత్రా రాజీనామా చేశారు. చందన్ మిత్రా 2018 లో బిజెపిని విడిచిపెట్టి, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఒకప్పుడు బెంగాల్‌లో “టెర్రర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. Read Also… Python Dead: కొండచిలువ ఆకలి తీర్చుకోవడనికి వెళ్లి.. చేపలను కడుపారా తింది.. అంతలోనే ఆయువు పోయింది

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu