US Tariffs: సుంకాల పులకేశి.. మళ్లీ బాదాడు తలకేసి!.. 50 శాతం మోత.. ఎవరెవరికి వాత?
బండోడు, అమెరికా మొండోడు.. ఇదిగో మళ్లీ వేశాడు. మీ రేంజ్‌కి పాతిక శాతం సరిపోదు.. ఇంద ఇంకో పాతిక శాతం తీసుకోండి, మొత్తం యాభైశాతం అని ఇండియా తలకేసి బాదేశాడు సుంకాల పులకేశి. సుంకాలబాదుడు ఇప్పట్లో ఆగదని, మరిన్ని సుంకాలొస్తున్నాయ్ గెట్ రెడీ అని సంకేతాలు కూడా ఇచ్చాడు.

మీది డెడ్ ఎకానమీ. ఒక ముగిసిన కథ. భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది.. అని ఇటీవలే ప్రపంచమంతా వినిపించేలా బిగ్గరగా అరిచి గీపెట్టేశారు ట్రంప్. మన పరువుతీసినంత పనయ్యిందక్కడ. కానీ.. అదే నోటితో ఇంకో మాటన్నారు. ఇండియా దగ్గర బోలెడంత డబ్బుంది, ఎక్కువ పన్నులు కట్టే దేశంగా వాళ్లను మేమెప్పటికీ చేరుకోలేం అని పొగిడేశారు. ఇదే వంక చూపెట్టి మీకు మేమెందుకు నిధులు ఇవ్వాలి, మా దేశం ఎందుకు త్యాగం చెయ్యాలి అంటూ వెకిలినవ్వు నవ్వుతారు. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి ఇవ్వజూసిన 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను డోజ్ ద్వారా ఇటీవలే రద్దు చేయించారు అమెరికా అధ్యక్షుడు. అతడిది నోరా లేక తాటిమట్టా తెలీదు కానీ.. ఆ నోటికి అడ్డూఅదుపూ లేదన్నది తేలిపోయింది. ఇప్పుడు అదే కడుపుమంటతో ఇండియా మీద విరుచుకుపడ్డాడు. సుంకాల పేరుతో మన ఆర్థిక వ్యవస్థతో తొండాట మొదలుపెట్టేశారు. బండోడు, అమెరికా మొండోడు.. ఇదిగో మళ్లీ వేశాడు. మీ రేంజ్‌కి పాతిక శాతం సరిపోదు.. ఇంద ఇంకో పాతిక శాతం తీసుకోండి, మొత్తం యాభైశాతం అని ఇండియా తలకేసి బాదేశాడు సుంకాల పులకేశి. సుంకాలబాదుడు ఇప్పట్లో ఆగదని, మరిన్ని సుంకాలొస్తున్నాయ్ గెట్ రెడీ అని సంకేతాలు కూడా ఇచ్చాడు. పనిగట్టుకుని భారత్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర నో ఆన్సర్. ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన పెదరాయుడ్ని తానేనంటూ 14 సార్లు చాటింపు వేసుకుని మన...
