AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడిపోయిన దారులు.. ఇండియా కూటమికి బీటలు.. కాంగ్రెస్‌తో డీఎంకే తెగతెంపులు..!

లోక్‌సభలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీల సీటింగ్ అమరికలో మార్పులు చేయాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఎంపీ కనిమొళి కరుణానిధి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది.

విడిపోయిన దారులు.. ఇండియా కూటమికి బీటలు.. కాంగ్రెస్‌తో డీఎంకే తెగతెంపులు..!
Dmk Mp Kanimozhi
Balaraju Goud
|

Updated on: May 08, 2026 | 3:21 PM

Share

లోక్‌సభలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీల సీటింగ్ అమరికలో మార్పులు చేయాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఎంపీ కనిమొళి కరుణానిధి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది.

చాలా కాలంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ (I.N.D.I.A) కూటమిలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉంటూ వస్తోంది. అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు కనిమొళి తన లేఖలో స్పష్టం చేశారు. పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత కూడా సభలో కాంగ్రెస్ ఎంపీల పక్కనే డీఎంకే సభ్యులు కూర్చోవడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు కనిమొళి.

డీఎంకే పార్లమెంటరీ పార్టీకి సభలో ప్రత్యేకమైన సీట్లను కేటాయించాలని ఆమె స్పీకర్‌ను కోరారు. లోక్‌ సభలో తమ గళాన్ని బలంగా వినిపించడానికి, పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఈ ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇండియా కూటమి నుంచి విడిపోయిన తర్వాత తమ పార్టీ స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ఈ విన్నపం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

లోక్‌సభలో డీఎంకే పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. దక్షిణాది రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దూరం జరగడం జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. సభలో సీట్ల మార్పు అనేది కేవలం భౌతికమైన మార్పు మాత్రమే కాదు, అది ఒక పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయానికి ప్రతీక.

Dmk Mp Kanimozhi Letter

Dmk Mp Kanimozhi Letter

సాధారణంగా సభలో పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ సీట్లను కేటాయిస్తారు. కనిమొళి అభ్యర్థనపై స్పీకర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ దీనికి అంగీకరిస్తే, లోక్‌సభలో ప్రతిపక్ష వరుసలలో మార్పులు చోటుచేసుకుంటాయి. “తమ పార్టీకి ప్రత్యేక సీట్లు కేటాయించడం ద్వారా సభ్యులు మరింత స్వేచ్ఛగా, ప్రభావవంతంగా పనిచేయగలరని” కనిమొళి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌