Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తక్కువ ధరకే బంగారం కొనాలంటే ఈ సమయం కోసం వేచి చూడాల్సిందే!
Gold Price: సాధారణంగా ఆగస్టు చివరి నుండి డిసెంబర్ వరకు పసిడి ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. గరిష్ఠ ధరలు ప్రపంచవ్యాప్త పండుగలు, పెళ్లిళ్ల సీజన్, సెలవుల కారణంగా డిమాండ్ పెరిగి, సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. జనవరి..

Gold Price: ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు లేదా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులకు కనిపించే ఏకైక సురక్షిత ఆశ్రయం ‘బంగారం’. కేవలం ఆభరణంగానే కాకుండా, ఆపద కాలంలో ఆదుకునే ఆస్తిగా పసిడికి ఎనలేని గుర్తింపు ఉంది. అయితే బంగారం ఎప్పుడు పడితే అప్పుడు కొనడం కంటే, ధరలు తగ్గే కాలాన్ని బట్టి కొనుగోలు చేస్తే గరిష్ఠ లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే, బంగారం ధరలు సంవత్సరం పొడవునా ఒకేలా ఉండవు. 1975 నుండి ఉన్న డేటా ప్రకారం.. అనువైన సమయం: సాధారణంగా వసంత, వేసవి కాలాల్లో ధరలు కొంత మేర తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అత్యంత అనువైన సమయాలని చెబుతున్నారు. రెండో ఛాన్స్: జూన్, జూలై నెలల్లో కూడా ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!
ధరలు ఎప్పుడు పెరుగుతాయి?
సాధారణంగా ఆగస్టు చివరి నుండి డిసెంబర్ వరకు పసిడి ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. గరిష్ఠ ధరలు ప్రపంచవ్యాప్త పండుగలు, పెళ్లిళ్ల సీజన్, సెలవుల కారణంగా డిమాండ్ పెరిగి, సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. జనవరి, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో కూడా కాలానుగుణంగా ధరలు పెరుగుతుంటాయి.
2026 నాటికి ధరల అంచనా ఎలా ఉంది?
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు భవిష్యత్తులో బంగారం ధరలపై ఆసక్తికరమైన అంచనాలను వెలువరించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ (HSBC) వంటి సంస్థలు బంగారం ధర ఔన్సుకు $5,000 మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాయి. గోల్డ్‌మన్ సాక్స్ సుమారు $4,900 వరకు ఉండవచ్చని పేర్కొంది. డ్యుయిష్ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు ధరలు $4,000 నుండి $4,200 మధ్య ఉండవచ్చని విశ్లేషిస్తున్నాయి.
ఇక యూబీఎస్ (UBS), ఐఎన్జీ (ING) బ్యాంక్ వంటివి $3,500 నుండి $3,700 స్థాయిలను అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల నుండి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా 2026 అంతటా బంగారం ధరలు ఒక బలమైన వృద్ధి దిశగా సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పెట్టుబడిదారులు ఈ కాలానుగుణ మార్పులను గమనిస్తూ క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Best Scheme: రోజుకు రూ.45 ఆదా చేస్తే చాలు.. మెచ్యూరిటీకి రూ.25 లక్షలు మీ సొంతం.. మతి పోగొట్టే స్కీమ్!
ఇది కూడా చదవండి: Indian Railways: 40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్.. వెంటనే రీఫండ్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




