AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquito: దోమల బెడదతో విసిగిపోతున్నారా? మీ ఇంట్లో ఈ 3 మొక్కలు పెంచండి.. దోమలు పరార్!

Mosquito Repellent Plants: కెమికల్స్ వాడకం తగ్గించి, ఇలాంటి సహజమైన మొక్కలను పెంచడం వల్ల ఇల్లు సువాసనభరితంగా ఉండటమే కాకుండా, దోమల నుండి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మొక్కలు కేవలం దోమలను నివారించడానికి సహాయపడతాయి..

Mosquito: దోమల బెడదతో విసిగిపోతున్నారా? మీ ఇంట్లో ఈ 3 మొక్కలు పెంచండి.. దోమలు పరార్!
Mosquito
Subhash Goud
|

Updated on: May 08, 2026 | 12:48 PM

Share

Mosquito Repellent Plants: వర్షాకాలం లేదా వేసవి కాలం ఏదైనా, దోమల సమస్య ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. మార్కెట్లో దొరికే దోమల కాయిల్స్ లేదా కెమికల్ స్ప్రేలు వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇవి ఇబ్బందికరంగా మారతాయి. అయితే, మన ప్రకృతిలో కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటి వాసన అంటే దోమలకు అస్సలు పడదు. మీ ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఈ 3 మొక్కలను పెంచడం ద్వారా దోమలను సహజంగా తరిమికొట్టవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Balance: మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోందని సంబరపడుతున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

  1. మ్యారీగోల్డ్ (బంతి పూల మొక్క): బంతి పూలు కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాదు, దోమలను అడ్డుకోవడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి.బంతి పూల మొక్కల నుండి వచ్చే ఒక రకమైన ఘాటైన వాసన దోమలకు పడదు. ఇందులో ఉండే ‘పైరెత్రమ్’ (Pyrethrum) అనే సమ్మేళనాన్ని అనేక దోమల నివారణ మందులలో ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచడం వల్ల దోమలు లోపలికి రాకుండా ఉంటాయి.
  2. లెమన్ గ్రాస్: దోమలను తరిమికొట్టే మొక్కల జాబితాలో లెమన్ గ్రాస్ అత్యంత శక్తివంతమైనది. లెమన్ గ్రాస్ నుండి ‘సిట్రోనెల్లా ఆయిల్’ (Citronella Oil) లభిస్తుంది. దీనిలోని నిమ్మ వాసన దోమలను అయోమయానికి గురిచేసి, అవి మన దగ్గరకు రాకుండా చేస్తుంది. అనేక మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ తయారీలో ఈ నూనెను వాడతారు. దీనిని పెంచడం సులభం, దీని ఆకులను టీలో కూడా వాడుకోవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. తులసి మొక్క: భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీనికి ఉన్న ఔషధ గుణాలతో పాటు దోమలను తరిమే శక్తి కూడా ఉంది. తులసి ఆకుల నుండి వచ్చే సహజమైన సువాసన కీటకాలను, ముఖ్యంగా దోమలను దూరంగా ఉంచుతుంది. తులసి ఆకుల రసాన్ని చర్మంపై రాసుకున్నా దోమలు కుట్టవు.ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా, ఇంట్లోకి వచ్చే క్రిమి కీటకాలను అడ్డుకుంటుంది.

కెమికల్స్ వాడకం తగ్గించి, ఇలాంటి సహజమైన మొక్కలను పెంచడం వల్ల ఇల్లు సువాసనభరితంగా ఉండటమే కాకుండా, దోమల నుండి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మొక్కలు కేవలం దోమలను నివారించడానికి సహాయపడతాయి. కానీ ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Gold Buying: ఇకపై రూ.1000కే బంగారం కొనవచ్చు.. గోల్డ్‌ కొనేందుకు కొత్త మార్గం..!

Follow Us