AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathi leelavathi Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి సినిమా ఎలా ఉందో తెలుసా..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి చిత్రం ‘సతీ లీలావతి’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. దేవ్ మోహన్ హీరోగా నటించారు. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించగా వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

Sathi leelavathi Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి సినిమా ఎలా ఉందో తెలుసా..?
Sathi Leelavathi
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 08, 2026 | 3:11 PM

Share

మూవీ రివ్యూ: సతీ లీలావతి

నటీనటులు: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఇవి కూడా చదవండి

ఎడిటింగ్: సతీష్ సూర్య

సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్

నిర్మాత: నాగ మోహన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: తాతినేని సత్య

కథ:

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. చిన్నతనంలో తల్లిదండ్రుల (నరేష్, పవిత్ర) మధ్య చూసిన గొడవల ప్రభావం వల్ల ఆమెకు కొన్ని మానసిక భయాలు ఏర్పడతాయి. ఆ సమస్య నుంచి బయటపడే క్రమంలో రామ్ సేతు (దేవ్ మోహన్) అనే సైకాలజిస్ట్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి, తండ్రిని ఒప్పించి మరీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న మూడేళ్ల తర్వాత, రామ్ సేతు తనకు విడాకులు కావాలని అడుగుతాడు. తాను నర్సు నికోలా సెబాస్టియన్ (మడోనా సెబాస్టియన్)తో ప్రేమలో ఉన్నానని, విడాకులు ఇస్తే ఆమెతో కొత్త జీవితం మొదలుపెడతానని చెబుతాడు. ఆ మాటలతో కోపంతో రగిలిపోయిన లీలావతి అతన్ని చితకబాది ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత వారి బంధం ఏ మలుపు తిరిగింది, మధ్యలో వచ్చిన ఇతర పాత్రల నేపథ్యం ఏంటి, చివరకు వారు విడిపోయారా లేదా కలిశారా అనేది మిగతా కథ.

కథనం:

సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త వేగవంతం అయినట్లు అనిపించినా అందులో ఎలాంటి ఉత్కంఠ ఉండదు. ఇక ద్వితీయార్థం అయితే మరీ గందరగోళంగా సాగుతుంది. దొంగ ట్రాక్, హీరో తప్పించుకునే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు కేవలం టైమ్ పాస్ కోసం ఇరికించినట్లు ఉంటాయి. క్లైమాక్స్‌ను ఒక గేమ్ లాగా వెరైటీగా ప్లాన్ చేసినా అది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు. ఈ తరహా కథ చెప్పాలంటే చాలా వినోదాత్మకంగా అయినా ఉండాలి లేదంటే ఎమోషనల్ పద్దతైనా ఉండాలి. కానీ దర్శకుడు ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడుతూ కనిపించాడు. అందుకే సినిమా అటూ ఇటూ కాకుండా మధ్యలోనే ఆగిపోయింది.

నటీనటులు:

లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకుంది. భర్తపై కోపం చూపించే సన్నివేశాల్లో ఆమె నటన నవ్విస్తుంది. దేవ్ మోహన్ పాత్ర ఎక్కువ భాగం ఒకే చోట కుర్చీకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. మడోన్నా సెబాస్టియన్, నరేష్, వీటీవీ గణేష్ తమ పాత్రల పరిధి మేర పర్వాలేదనిపించారు. సప్తగిరి, తాగుబోతు రమేష్, జాఫర్ అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ టీం:

మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది.. పాటలు బాగానే ఉన్నాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్లుగా ఓ మోస్తరుగా ఉన్నాయి. ఎడిటింగ్ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తీసేసినా నష్టం అయితే కనిపించదు. చాలా కాలం విరామం తర్వాత దర్శకత్వం వహించిన సత్య తాతినేని ఎంచుకున్న కథలో కొత్తదనం అయితే కనిపించదు. కథనాన్ని అనవసరంగా సాగదీయడం వల్ల సినిమా కూడా నీరసంగా సాగింది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సతీ లీలావతి.. ఆకట్టుకోని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..