ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడితో నటించడం నా అదృష్టం.. ప్రియమణి..
Rajitha Chanti
Pic credit - Instagram
08 May 2026
హీరోయిన్ ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు. తాను నటి కాకపోయి ఉంటే ఫ్లయింగ్ క్రూగా మారేదానినని అన్నారు.
విమానాల్లో క్రూ సభ్యులు చక్కగా, వృత్తి నైపుణ్యంతో పనిచేయడం తనను ఆకట్టుకుందని తెలిపారు. అది అంత సులభమైన పని కాదని, వారు ఎనిమిది గంటలకు పైగా పనిచేయాలని అన్నారు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ఆయనంటే తనకు చాలా గౌరవం అని ప్రియమణి స్పష్టం చేశారు. ఒక నటుడిగా, వ్యక్తిగా, డ్యాన్సర్‌గా ఎన్టీఆర్ అసాధారణమైనవారని అన్నారు.
ఆయనలో ఎలాంటి తప్పులు కనుగొనలేమని, యమదొంగ చిత్రంలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు ప్రియమణి.
ఎన్టీఆర్ చాలా వేగంగా స్టెప్స్ నేర్చుకుంటారని, కేవలం ఒకసారి చూసి వెంటనే చేసేస్తారని, ఆయనతో మళ్ళీ పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ప్రియమణి తెలిపారు.
గతంలో తాను అంత ఫిట్‌నెస్ ఫ్రీక్ కాదని, అయితే ఇప్పుడు యోగా అంటే ఆసక్తి ఎక్కువ అని అన్నారు. వారానికి మూడుసార్లు పవర్ యోగా చేస్తానని, ఇది తనను శక్తివంతంగా ఉంచుతుందని చెప్పారు.
ఆహారం విషయంలో పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యమని, చిన్నప్పటి నుంచీ తాను అతిగా తినలేదని అన్నారు. కినువా, బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకుంటానని అన్నారు.
అప్పుడప్పుడు తెల్ల అన్నం కూడా తింటానని వెల్లడించారు. కేవలం డైట్ మాత్రమే కాకుండా, కొంత వ్యాయామం కూడా తప్పనిసరి అని, కనీసం 5000 నుండి 10000 అడుగులు నడవాలని అన్నారు.