లిక్కర్ కోసం రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య లొల్లి.. ఏకంగా పోలీస్ స్టేషన్ చేరిన పంచాయితీ!

మదుక్కరై సబ్ ఇన్స్పెక్టర్ వీర భద్రన్ అతని బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మద్యం స్వాధీనం చేసుకోవడంపై తమిళనాడు పోలీసుల తీరును తప్పుపట్టారు.

లిక్కర్ కోసం రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య లొల్లి.. ఏకంగా పోలీస్ స్టేషన్ చేరిన పంచాయితీ!
Tamil Nadu Puducherry Police Fight
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Nov 25, 2024 | 2:43 PM

లిక్కర్ బాటిళ్ల కోసం.. తమిళనాడు పోలీసులు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ లిక్కర్ బాటిళ్ల విషయమై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. మా రాష్ట్రంలో అడుగుపెట్టి, మీ రుబాబేంటి అంటూ తమిళనాడు పోలీసులపై పుదుచ్చేరి పోలీసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా చూస్తున్న అక్కడికి వచ్చిన పర్యాటకులు సైతం విస్తుపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ పుదుచ్చేరికి తమిళనాడు పోలీసులు ఎందుకు వెళ్లారు. పుదుచ్చేరి పోలీసులు వారిని ఎందుకు అడ్డుకున్నారు తెలుసుకుందాం..!

రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల కంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో బట్టలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, లిక్కర్ చౌకగా లభిస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర పాలిత ప్రాంతాల్లో విధించే పన్ను శాతం తక్కువగా ఉండడంతో ఇక్కడ తక్కువ ధరకే లభిస్తుంటాయి. ఈ క్రమంలోనే పుదుచ్చేరి పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే లిక్కర్ ధరల్లో చాలా వరకు తేడాలు ఉండడంతో ఎక్కువమంది ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్లేటప్పుడు, తక్కువ ధరకే దొరకే లిక్కర్తమ వెంట తీసుకువెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు.

ఇక్కడ మద్యం కొనుగోలు చేయడం వల్ల పుదుచ్చేరి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడి నుంచి తీసుకువెళ్లే క్రమంలో పక్క రాష్ట్రాల్లో అమ్మకాలపై ప్రభావం ఉంటుంది. దాని ద్వారా ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది. ఈ కారణం చేత కేంద్ర పాలిత ప్రాంతాలు , రాష్ట్రాల్లో సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి మరి తమ రాష్ట్రాల్లోకి మద్యం రాకుండా గట్టి నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుంటారు. ఇప్పుడు ఇదే విషయం రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య వివాదానికి కారణమైంది.

పుదుచ్చేరి నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత తమిళనాడు పోలీసులు పెన్నై వంతెన చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, మద్యం ప్యాకెట్లను గుర్తించి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి తనకోసం కాకుండా తమిళనాడులో విక్రయించేందుకు తీసుకు వెళుతున్నట్టు అనుమానించిన పోలీసులు.. పుదుచ్చేరిలో ఎక్కడ కొనుగోలు చేశారు అన్న విషయంపై అరా తీసేందుకు పుదుచ్చేరి వెళ్లారు. పుదుచ్చేరిలో మదుక్కరై లోని రాజ అనే వ్యక్తి పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతితో నడుపుతున్న షాపులో సోదాలు నిర్వహించారు. దాదాపు 40 లీటర్ల మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మదుక్కరై సబ్ ఇన్స్పెక్టర్ వీర భద్రన్ అతని బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మద్యం స్వాధీనం చేసుకోవడంపై తమిళనాడు పోలీసుల తీరును తప్పుపట్టారు. తమ రాష్ట్రం పరిధిలోకి వచ్చి అనుమతితో నడుస్తున్న షాపులో మద్యం ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ పుదుచ్చేరి నుంచి మీ రాష్ట్రంలోకి మద్యం తీసుకువస్తే, అతనిపై చర్యలు తీసుకోవాలి తప్ప చట్టపరంగా అమ్మకాలు జరుగుతున్న చోటకి వచ్చి సోదాలు స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తప్పు చేస్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్లి విచారణ చేయడం వాటిని అడ్డుకోవడం మాకు కూడా అవకాశాలు ఉన్నాయని తమిళనాడు పోలీసులు తేల్చి చెప్పడంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇక చేసేదీలేక స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్లను స్థానిక పోలీస్ స్టేషన్‌లో తమిళనాడు పోలీసులు అప్పజెప్పారు. ఇకపై పుదుచ్చేరి నుంచి ఎవరైనా మద్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి తమిళనాడు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!