Dharmendra Pradhan: పకోడి బాగుంది.. మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్ర మంత్రి

దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి రాజకీయ నేతల హడావుడి ఎక్కువైపోయింది. ఎవరికి వారు తమ ప్రచారాలను ముమ్మరం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒడిశాలోని సంబల్పూర్‌లో వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్‌ రుచులను చూశారు. చిరువ్యాపారులతో ధర్మేంద్ర ప్రధాన్‌ ముచ్చటించారు. అక్కడి రుచులను

Dharmendra Pradhan: పకోడి బాగుంది.. మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్ర మంత్రి
Dharmendra Pradhan
Follow us

|

Updated on: Apr 16, 2024 | 5:47 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి రాజకీయ నేతల హడావుడి ఎక్కువైపోయింది. ఎవరికి వారు తమ ప్రచారాలను ముమ్మరం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒడిశాలోని సంబల్పూర్‌లో వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్‌ రుచులను చూశారు. చిరువ్యాపారులతో ధర్మేంద్ర ప్రధాన్‌ ముచ్చటించారు. అక్కడి రుచులను అస్వాధించిన మంత్రి డిజిటల్ ఇండియా ద్వారా యూపీఐతో చెల్లింపులు చేశారు. అయితే మిర్చి బండి వద్ద పకోడి తిన్న కేంద్ర మంత్రి బాగుందని కితాబు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే సౌకర్యాలను మోదీజీ డిజిటల్ ఇండియా ద్వారా ప్రతి నగరానికి, పల్లెకు అందుబాటులోకి తెచ్చారన్నారు. అందుకే సంబల్‌పూర్ నుండి సౌరాష్ట్ర వరకు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ ‘మరోసారి మోడీ ప్రభుత్వం’ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు ఏవైనా లావాదేవీలు జరగాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేదని, మోడీ వచ్చిన తర్వాత డిజిటల్‌ ఇండియాగా మార్చేశారన్నారు. డిజిటల్‌ ఇండియా వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండి కూడా లావాదేవీలు చేసుకోవడం, అలాగే కూరగాయల వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు డిజిటల్‌ టెక్నాలజీకి అలవాటు పడ్డారన్నారు. చిరు వ్యాపారుల వద్ద కూడా యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.

ఇదిలా ఉండగా, ఒడిశా లోక్‌సభ ఎన్నికలు మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1 తేదీల్లో నాలుగు దశల్లో నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు 7 దశల్లో జరుగుతాయి. ఏడు దశల్లో 543 నియోజకవర్గాలు జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ 1న జరగనుంది.

Latest Articles
ఈ ఫొటోలోని అంకెల మధ్య వేరే నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం
ఈ ఫొటోలోని అంకెల మధ్య వేరే నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం
వాలంటీర్లకు డెడ్‌లైన్ విధించిన టెక్కలి వైసీపీ అభ్యర్థి
వాలంటీర్లకు డెడ్‌లైన్ విధించిన టెక్కలి వైసీపీ అభ్యర్థి
చవకైన ధరలో 5జీ ఫోన్.. ఐఫోన్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లు..
చవకైన ధరలో 5జీ ఫోన్.. ఐఫోన్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లు..
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
పొలిమేర 2 హీరోయిన్‏కు అత్యున్నత పురస్కారం..
పొలిమేర 2 హీరోయిన్‏కు అత్యున్నత పురస్కారం..
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పిన భర్త..!
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పిన భర్త..!
చుండ్రు సమస్యతో విసుగెత్తిపోయారా.. పసుపుతో చెక్ పెట్టండిలా..
చుండ్రు సమస్యతో విసుగెత్తిపోయారా.. పసుపుతో చెక్ పెట్టండిలా..
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఈవెంట్‌లను ప్లాన్‌
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఈవెంట్‌లను ప్లాన్‌
గుజరాత్ వేదికగా రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
గుజరాత్ వేదికగా రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
KCPDరా చిచ్చా.. పాత కూలర్‌ను ఏసీగా మార్చేశాడు.. ఇక ఇల్లంతా కూల్.!
KCPDరా చిచ్చా.. పాత కూలర్‌ను ఏసీగా మార్చేశాడు.. ఇక ఇల్లంతా కూల్.!