Sound Pollution: అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి.. డీజే సౌండ్‌తో మొద్దుబారిన 250 మంది చెవులు.. 70 మందికి తీవ్ర అస్వస్థత

పర్యావరణానికి హానికలించే కాలుష్యంతో ఒకటి శబ్ద కాలుష్యం. మానవుల జీవిత కార్యకలాపాలపై హానికరమైన ప్రభావం కలగజేసే శబ్దాలను శబ్దకాలుష్యం లేదా ధ్వని కాలుష్యం అని అంటారు. WHO చెప్పిన ప్రకారం  శబ్దం 75 డెసిబెల్స్ (dB) మించి శబ్దాలు హానికరం.. అంతేకాదు 120 dB కంటే ఎక్కువ స్థాయిలో ఉంటె నొప్పిగా అనిపిస్తాయి. తాజాగా డీజే సాంగ్స్ ను బిగ్గరగా పెట్టడంతో వందల మంది ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Sound Pollution: అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి.. డీజే సౌండ్‌తో మొద్దుబారిన 250 మంది చెవులు.. 70 మందికి తీవ్ర అస్వస్థత
Maharashtra People Hospitalized
Follow us

|

Updated on: Apr 16, 2024 | 5:52 PM

మహారాష్ట్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డీజే ప్లే చేస్తూ.. అందరూ ఉత్సాహంగా వేడుకలను  జరుపుకున్నారు. అకస్మాత్తుగా DJ వాయిస్ ఎక్కువగా వినిపించడంతో అందరి తలలు ఒక్కసారిగా మొద్దుబారడం ప్రారంభించాయి. డీజే పెద్ద శబ్దం విని 250 మంది ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వారికి  ఏమీ వినిపించలేదు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో 70 మంది బాధితులు ఆసుపత్రులో చికిత్స నిమిత్తం చేరారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 14న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున క్రాంతి చౌక్‌లో డీజే సాంగ్స్ తో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సిటీలో జరుగుతున్నా ఈ ఈవెంట్ కోసం పూణే నుంచి 15 మంది డీజేలను ఆహ్వానించారు. చెవులు చిల్లులు పడే విధంగా డీజే సాంగ్స్  పెట్టుకుని డీజేలతో కలిసి జోరుగా యువత  డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా DJ సాంగ్స్ సౌండ్ దాదాపు 150 డెసిబుల్స్ ఉంది.

DJ ఏ వయస్సు వ్యక్తులపై చెడు ప్రభావాన్ని చూపించిందంటే

డీజే శబ్దం విని అక్కడున్న వారి ఆరోగ్యం క్షీణించింది. DJ సౌండ్ విని అస్వస్థతకు గురైన వారి వయస్సు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అస్వస్థతకు గురైన వారిలో వృద్ధులు కాదు యువతే ఎక్కువగా ఉంది. డీజే వాయిస్‌ విన్న 17 నుంచి 40 ఏళ్ల లోపు వారి చెవులు మొద్దుబారిపోయాయి. ఈ వయస్సులో ఉన్న 250 మంది రోగులను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మూడు సర్కిళ్లపై కేసు నమోదు

నిర్దేశిత పరిమితిని మించిన వాల్యూమ్‌లో DJ ప్లే చేసినందుకు మూడు సర్కిల్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. శబ్ద కాలుష్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను క్రాంతి చౌక్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం, శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం కింద మూడు సర్కిళ్లపై కేసు నమోదు చేశారు.

ఎవరికైనా డీజే శబ్దం విని చెవులు మొద్దుబారిపోతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 72 గంటల ఆలస్యంచేస్తే ఆ వ్యక్తి చెవిటివారిగా మారే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..