AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjwala Scheme: గుడ్ న్యూస్.. ఇప్పుడు 2014లో ఉన్న ధరలకే గ్యాస్ సిలిండర్లు.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

దసరా, దీపావళికి ముందు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఉజ్వల పథకం (ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ) లబ్ధిదారులకు పెద్ద బహుమతిని అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్‌పై రూ.200 నుంచి రూ.300కి పెంచుతున్నట్లు మోదీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

Ujjwala Scheme: గుడ్ న్యూస్.. ఇప్పుడు 2014లో ఉన్న ధరలకే గ్యాస్ సిలిండర్లు.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2023 | 1:54 PM

Share

దసరా, దీపావళికి పండుగలకు ముందు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఉజ్వల పథకం (ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ) లబ్ధిదారులకు పెద్ద బహుమతిని అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్‌పై రూ.200 నుంచి రూ.300కి పెంచుతున్నట్లు మోదీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్‌పై రూ.200 నుంచి రూ.300కి పెంచుతున్నట్లు ప్రకటించారు. గతంలో ఉజ్వల పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ వచ్చేదని, అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచుతున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఉజ్వల లబ్ధిదారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించారన్నారు. సబ్సిడీ ధర తగ్గించి కోట్లాది మంది తల్లులు, సోదరీమణులకు నవరాత్రి.. ఇతర పండుగల ఆనందాన్ని రెట్టింపు చేశారంటూ పేర్కొన్నారు. అంతకుముందు ఉజ్వల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు.. రూ.200ల సబ్సిడీ ఉండేదన్నారు. ఇప్పుడు నిన్నటి క్యాబినెట్ నిర్ణయంలో రూ.100 తగ్గింపు తర్వాత.. ఇప్పుడు ఉజ్వల లబ్ధిదారులకు LPG సిలిండర్ ఒక్కొక్కటి రూ.500 రూపాయల చౌకగా మారిందన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్..

2014లో దాదాపు అదే ధరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండేవని.. 2023లో కూడా దాదాపు అదే ధరకు ఉజ్వల తల్లులు, అక్కాచెల్లెళ్లకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. దీంతో మోదీ ప్రభుత్వం పేదల ప్రయోజనాలు, ఆత్మగౌరవం, గౌరవాన్ని కాపాడుతుందన్నారు. తల్లులు-సోదరీమణులు-కూతుళ్లు, అణగారిన వర్గాలు.. పట్ల మోడీ ప్రభుత్వం సున్నితత్వం, నిబద్ధతను చూపుతుందంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్టర్‌లో వెల్లండించారు.

కాగా.. గ్యాస్ ధరలను ఇటీవలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు అదనంగా రూ.200లు తగ్గించింది. అంతేకాకుండా ఇప్పుడు లభించే సబ్సిడీ రూ.200 తాజాగా ప్రకటించిన సబ్సిడీ వందతో కలిపి రూ. 500ల మేరకు గ్యాస్ ధర తగ్గింది. ధర తగ్గింపు, సబ్సిడీ రెండూ కలిపి ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్ రూ.603 కి లభించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..