Lok Sabha Elections 2024: ‘సంబల్‎పుర్‎లో జన సంద్రం కనిపిస్తోంది’.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని సంబల్‎పుర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఆయన. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఒకవైపు ప్రధాని మోదీ రాష్ట్రాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. అభ్యర్థులు మాత్రం తమ సొంత నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Lok Sabha Elections 2024: 'సంబల్‎పుర్‎లో జన సంద్రం కనిపిస్తోంది'.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Follow us
Srikar T

|

Updated on: Apr 10, 2024 | 4:09 PM

లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని సంబల్‎పుర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఆయన. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఒకవైపు ప్రధాని మోదీ రాష్ట్రాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. అభ్యర్థులు మాత్రం తమ సొంత నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. అందులో భాగంగా తాను పోటీ చేసే సంబల్ పుర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సంబల్ పుర్ పరిధిలోని కూచిండాలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గత 10 సంవత్సరాల్లో మోదీ చేసిన అభివృద్ది గురించి వివరించారు. అలాగే తన ముందు జనసంద్రం ఉప్పొంగుతోందని రోడ్ షోకు హాజరైన ప్రజలను ఉద్దేశించి అన్నారు.

రోడ్ షో వీడియో..

ఇవి కూడా చదవండి

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పై కూడా విమర్శలు గట్టిగానే ఎక్కుపెడుతోంది. మరోసారి బీజేపీకి పట్టం కట్టి మోదీని ప్రధానిగా చేయాలని ప్రజలను కోరారు. గతంలో కంటే అధిక లోక్ సభ స్థానాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఎవరూ చేయలేని పనిని, ప్రతిష్ఠాత్మకమైన రామమందిరాన్ని నిర్మించిన ఘనత బీజేపీ నేతృత్వంలోని మోదీకే దక్కుతుందని కీర్తించారు. దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మరోసారి నరేంద్ర మోదీకి అధికారాన్ని ఇస్తే ప్రపంచ దేశాలు మన శక్తిని అందిపుచ్చుకునే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర మంత్రి మాటలకు కార్యకర్తలు కేరింతలు కొడుతూ బీజేపీ రోడ్ షోలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఎన్నికల ప్రచారం వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..