‘ఛలో ఢిల్లీ’.. తమపైకి టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించినా.. పోలీసుకు దాహం తీరుస్తున్న రైతు.. వీడియో వైరల్
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు చెబుతున్నారు.
Farmers Protest Delhi: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో భద్రతా బలగాలు కూడా మోహరించాయి. ఇక డిసెంబర్ 3న చర్చలు చేపట్టేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయినప్పటికీ రైతులు మాత్రం అక్కడే ఉండి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. (ఇప్పుడు ఇక్కడ ఉన్నాము.. కానీ ఏదో ఒక రోజు పోతాము.. వైరల్‌గా మారిన జవాన్ చివరి మాటలు)
కాగా ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు శుక్రవారం పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, నీళ్ల క్యాన్‌లను ఉపయోగించారు. ఇదిలా ఉంటే తాజాగా ఆందోళనలో పాల్గొన్న పోలీసుకు రైతు దాహం తీర్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ నెటిజన్.. వారిలో డ్యూటీలో భాగంగా రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై చల్లటి నీళ్లు చల్లారు. కానీ మనకు ఉన్న దాన్ని పక్కనున్న వారికి పంచుకోవడమే మన విధి అని గురువును చెప్పిన మాటలను రైతులు పాటించారు అని కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రైతుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ.. ఆ ముగ్గురి పాత్రలు సమానంగా ఉండనున్నాయట.. అంతేకాదు..!)