త్వరలోనే దేశీ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటు.. నిపుణుల కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం.. నియమ, నిబంధనల రూపకల్పన
కరోనా కాలంలో ఈ కామర్స్ సంస్థలు చాలా వృద్ధిలోకి వచ్చాయి. లాక్‌డౌన్ పేరిట అందరిని ఇంటిలోనే ఉంచిన ప్రభుత్వం ఈ కామర్స్ సంస్థలకు మాత్రం వెసులుబాటు కల్పించింది.
కరోనా కాలంలో ఈ కామర్స్ సంస్థలు చాలా వృద్ధిలోకి వచ్చాయి. లాక్‌డౌన్ పేరిట అందరిని ఇంటిలోనే ఉంచిన ప్రభుత్వం ఈ కామర్స్ సంస్థలకు మాత్రం వెసులుబాటు కల్పించింది. ఇక చాలామంది తమకు అవసరమైన వస్తువులు, గ్రాసరీస్, పుడ్ మొదలగు వాటిని ఆన్‌లైన్ కేంద్రంగా ఈ కామర్స్ సంస్థల ద్వారా పొందారు. అమెజాన్, ప్లిఫ్ కార్ట్ వంటి సంస్థలు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఆఫర్‌ల పేరిట కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి.
అయితే ఆన్‌లైన్ కేంద్రంగా జరుగుతున్న ఈ అమ్మకాలలో కొన్ని అవకతవకలు జరుగతున్నాయని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశీ ఈ కామర్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.ఇందుకోసం 11 మంది నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వామ్యం చేసింది. త్వరలోనే ఈ కమిటీ నియమ,నిబంధనలను తెలియజేస్తుంది. దీని ద్వారా ఈ కామర్స్ సంస్థలలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది. డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. కమిటీలో ఈమార్కెట్, ఎంఎస్‌ఎంఈ, నీతి ఆయోగ్, ఎన్‌పీసీఐ, ఎన్‌ఎస్‌డీఎల్ అధికారులతోపాటు.. జాతీయ ట్రేడర్ల సమాఖ్య, దేశీ రిటైలర్ల అసోసియేషన్ నుంచి ప్రతినిధులకు చోటు కల్పించింది. కొత్త విధివిధానాలతో ఈ కామర్స్ బిజినెస్‌ను పటిష్ట పరచేందుకు సన్నాహాలు చేస్తోంది.