అవార్డులు, రివార్డులు పొందిన దీప్ సిద్దు రైతు ఉద్యమంలోకి ఎందుకు వచ్చాడు..? అసలు ఎవరీ దీప్ సిద్దు

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..?

అవార్డులు, రివార్డులు పొందిన దీప్ సిద్దు రైతు ఉద్యమంలోకి ఎందుకు వచ్చాడు..? అసలు ఎవరీ దీప్ సిద్దు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 27, 2021 | 1:03 PM

Punjab Actor Deep Sidhu : కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. కొత్త చట్టాల్ని బేషరతుగా రద్దు చేయాలంటూనే 11 దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా.. పరిష్కారం దొరకడంలేదు. మరోవైపు చట్టాల రద్దు తప్ప మరే ప్రతిపాదనలైనా పరిశీలించేందుకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. కొన్ని సవరణలను స్వయంగా ప్రభుత్వమే వారి ముందుంచింది. కానీ, ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతున్న వేళ రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది.

అయితే, ఎర్రకోట ముట్టడికి ప్రధాన సూత్రధారి పంజాబీ గాయకుడు, నటుడు దీప్‌ సిద్దు. రెండు నెలలుగా ప్రశాంతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన వ్యక్తి. కర్షక సంఘాల నేతలకు కూడ తెలియకుండా తన ఆలోచనను అమలు చేశాడతను. ఎర్రకోట పై జాతీయ జెండా బదులు మరో జెండా ఎగురేయడమే కాదు సెక్యూరిటీ పోర్స్ పై దాడికి పురికొల్పింది అతనే కారణం.

ఇదిలావుంటే, ఎర్రకోట వద్ద ఓ ఫ్లాగ్ పోల్ పై పతాకాన్ని తానే ఎగురవేశాననిదీప్ సిద్దు అంగీకరించాడు. ఈ స్తంభంపై ‘నిషాన్ సాహిబ్’ పతాకాన్ని తను ఎగురవేశానని, కానీ జాతీయ పతాకాన్ని మాత్రం తొలగించలేదని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు చిహ్నమని ఆయన అన్నాడు. తన ఫేస్ బుక్ లో ఈ విషయాలు తెలియజేస్తూ.. మన దేశ సమగ్రత, సమైక్యతలను ఎవరూ ప్రశ్నించలేరన్నాడు. ఆ ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నది వాస్తవమేనని పేర్కొన్నాడు.ఇంతలా రైతు ఉద్యమాన్ని తారాస్థాయి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అసలు ఎవరీ దీప్ సిద్ధు..? ఎక్కడ నుంచి వచ్చాడు. అతని వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు హాట్ టాపికైంది.

ఏప్రిల్ 2, 1984లో సిక్కు కుటుంబంలో జన్మించిన దీప్ సిద్దు పంజాబ్ లోని ముక్తసర్ లో జన్మించాడు. ముక్త్‌సర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాధమిక విద్యను అభ్యసించిన దీప్ సిద్దు.. పటియాలలోని పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా సాధించి.. మోడల్, గాయకుడు, నటుడు, లాయర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

కింగ్‌ ఫిషర్‌ మోడల్‌గా ఎంట్రీ ఇచ్చిన దీప్ సిద్దు.. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. అనంతరం సినీరంగంలోకి ప్రవేశించి పంజాబ్ ప్రాంతీయ నటుడుగా రాణిస్తున్నాడు. తొలుత హీరోగా పరిచయం చేసినది సుప్రసిద్ద బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర. రామ్‌తా జోగి చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుస ఆపర్లతో మంచి నటుడుగా ప్రజాదరణ పొందాడు.

కాగా, ఇటీవల 2019 ఎన్నికల్లో ధర్మేంద్ర కుమారుడైన సన్నీ దేవళ్‌ తరఫున గురుదాస్‌పూర్‌లో బీజేపీకి ప్రచారం కూడా నిర్వహించాడు. దీంతో కొందరు బీజేపీ నాయకులతో ఆయనకు సత్ససంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బీజేపీ నేతలకు దీప్ సన్నిహితుడనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదే క్రమంలో 2019లో భారత ప్రధాని మోదీతో దిగిన దీప్ సిద్ధూ ఫోటోను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం పెద్ద వైరల్‌గా మారుతోంది.

ఇదిలావుంటే, సిద్దును తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దే ఉన్నారని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ ఓ టీవీ కార్యక్రమంలో తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిధు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై తాను పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ఎర్రకోటకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

పంజాబీ సినిమా రామ్‌తా జోగి సినిమాతో అరంగ్రేట్ చేసిన దీప్ సిద్దూకు.. మంచి ఆఫర్లే వచ్చాయి. 2017 లో ‘జోరా 10 నంబారియా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీప్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది జోరా. ఆ తర్వాత రంగ్ పంజాబ్, సాడే ఆలే, జోరా సినిమాల్లో నటించిన దీప్.. ధర్రేంద్ర, విద్యాబాలన్ అంటే బాగా అభిమానం చూపేవారు. ముంబైలో ర్యాంప్ వాక్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. హైమంత్ త్రివేది, రోహిత్ గాంధీ డిజైనర్స్ తరుపున దీప్ ప్రచారం కూడా నిర్వహించాడు. అటు మోడలింగ్‌గా మరోవైపు లాయర్‌గాను ప్రాక్టీస్ చేశారు. సహారా ఇండియాకు లీగల్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు దీప్. ఆ తర్వాత బ్రిటీషన్ సంస్థ హమ్మండ్స్ కు లీగల్ సలహాలిచ్చిన దీప్.. డిస్నీ, సోనీ పిక్చర్స్, ఇతర హాలీవుడ్ స్టూడియోలను నిర్వహించే హమ్మండ్స్ సంస్థకు న్యాయసలహాలు అందించారు. బాలాజీ టెలీ ఫిలింస్ కు సలహాదారుగా కూడా పని చేశారు. దీప్ సిద్దు.

నటుడిగానే కాకుండా బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రాణించాడు దీప్.. దీప్ సింగ్ చికెన్ ను బాగా ఇష్టంగా లాగిస్తాడు. ఎప్పటికైనా లండన్ కు వెళ్లి అక్కడే ఉండాలనుకునే దీప్.. అనుహ్యంగా రైతు నిరసన ఉద్యమంలో పాల్గొని చిక్కులు కొనితెచ్చుకున్నాడు. అంతేకాదు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏకంగా పేస్ బుక్ లో 20 లక్షల మంది పాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు దీప్. ఇన్ స్టాగ్రామ్ లో 15 వేలమంది పాలోవర్స్ ఉన్నారు. ఇక, దీప్ సిద్దు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2011 కింగ్ ఫిషర్ మోడల్ హంట్ అవార్డుతో పాటు 2012 ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు, 2013 బెస్ట్ మేల్ డిబట్ ఇన్ పంజాబీ సినిమా అవార్డును సాధించారు.

ఎర్రకోటపై తమ జెండాను ఎగురవేసిన తరువాత ఫేస్ బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చిన సిద్ధూ… ఆ దృశ్యాలను చూపిస్తూ, రైతులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. సిక్కు ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థతో సిద్దూకు సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఐన్‌ఏఏ) దర్యాప్తు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్లర్లకు కారణంగా భావిస్తున్న సిధుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆందోళనకారులను ఎర్రకోటపైకి వెళ్లేందుకు ప్రోత్సహించడం, సామాజిక మాధ్యమాల్లో పంజాబీ యువకులను రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేసిన ఆరోపణలపై నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. రైతుల ఆందోళన వ్యవహారంలో సిధుకు గతంలో పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబరులో, ఈ నెల 16న నోటీసులు పంపినా ఆయన విచారణకు రాలేదు.

Read Also… ఎర్రకోట వైపు రైతులను ప్రేరేపించింది ఎవరు..? ఆ హీరోతో ఢిల్లీ ఉద్రిక్తతలకు సంబంధమేంటీ..?