Wife and Husband: భర్త చేసే ఆ పనులకు విసిగిపోయిన భార్య.. ఇక భరించలేక ఓ రోజు ఏం చేసిందంటే..!

Wife and Husband: భర్త చేసే ఆ పనులకు విసిగిపోయిన భార్య.. ఇక భరించలేక ఓ రోజు ఏం చేసిందంటే..!
Wife And Husband

Wife and Husband: ఆయనకు అప్పటికే వివాహమైంది. భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలూ ఆమెకు తెలుసు.

Shiva Prajapati

|

May 25, 2022 | 7:36 PM

Wife and Husband: ఆయనకు అప్పటికే వివాహమైంది. భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలూ ఆమెకు తెలుసు. అంతకుమించి అతను ఆమె కంటే 20 ఏళ్లు పెద్ద. అయినప్పటికీ.. ఆర్థిక సమ్యల కారణంగా అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అప్పటి వరకు బాగానే నడిచింది. కానీ, ఆ తరువాతే ఆమెలో క్రూరత్వం నిద్రలేచింది. తన భర్త తనకే సొంతం అనే కాంక్షతో.. అతను తన మొదటి భార్య వద్దకు వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎక్కువ సమయం మొదటి భార్యతోనే గడపాన్ని జీర్ణించుకోలేకపోయింది. అంతేకాదు, అతనికి మరికొందరు మహిళలతోనూ వివాహేతర సంబంధం ఉందని భావించింది. అందలోనూ అతని వేధింపులు తీవ్ర అయ్యాయి. ఇక లాభం లేదనుకుని భావించింది.. ఒక క్రిమినల్‌కు సుపారీ ఇచ్చింది. తన భర్తను చంపేయాలని అతనితో ఒప్పందం చేసుకుని. ముందే పన్నిన పథకం ప్రకారం.. ఒక రోజు రాత్రి ఇంటి తలుపులు తీసి ఉంచగా.. ఆ హంతకుడు ఇంట్లోకి చొరబడి అతన్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మరి ఈ హత్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి.. ఆ నెపాన్ని దోపిడీ దొంగలపై నెట్టే ప్రయత్నం చేసింది. పోలీసులకు తన కథనే వల్లెవేసింది. మరి పోలీసులేమైనా తక్కువనా.. తమదైన స్టేల్లో విచారణ జరిపితే.. అసలు గుట్టు బయటపడింది. అతన్ని చంపించిన భార్య, చంపిన వ్యక్తి ఇద్దరూ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బహిర్ జిల్లా డీసీపీ సమీర్ శర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హోలీ కాన్వెంట్ స్కూల్ డీప్ ఎన్‌క్లేవ్, పార్ట్ 2 సమీపంలో హత్య జరిగిందంటూ మే 18వ తేదీన పోలీసులకు ఫోన్ కాల్ వెళ్లింది. దాంతో పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే వ్యక్తి రక్తపు మడుగులో బెడ్‌పై విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని, హత్య జరిగిన తీరును పరిశీలించారు పోలీసులు. మృతుడు వీర్ బహదూర్ వర్మ(50)గా గుర్తించారు. ఈ హత్యపై ఐపీసీ సెక్షన్ 302, 120బి, 34 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఊహించని వాస్తవాలు వెలుగు చూడగా.. పోలీసులు షాక్ అయ్యారు.

మృతుడి భార్యకు, మృతుడికి రోజూ గొడవలు జరిగేవట. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను విచారించగా.. సరికొత్త వెర్షన్ కథ వినిపించింది. కొందరు దుండగులు తమ ఇంట్లోకి ప్రవేశించి తన భర్తను దారుణంగా హత్య చేశారని, ఇంట్లోని నగలు, డబ్బును ఎత్తుకెళ్లారని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయితే, ఈ ఘటనపై ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడం, పదే పదే స్టేట్‌మెంట్‌ మార్చి చెప్పడంతో పోలీసులు అనుమానించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడే షాకింగ్ వ్యక్తి ఆ ఫుటేజీలో కనిపించాడు. రౌడీ షీటర్ జుమ్మన్ అనే వ్యక్తి ఆ ఇంటి చుట్టూ పలుమార్లు తిరుగుతూ కనిపించాడు. ఈ క్రమంలోనే.. మృతుడి భార్య చందర్ కాలా ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించారు పోలీసులు. అప్పుడు అసలు గుట్టు రట్టు అయ్యింది. మృతుడి భార్య చందర్.. రౌడీషీటర్ అయిన జుమ్మన్‌తో టచ్‌లో ఉందని, గత కొన్ని వారాలుగా అతనికి అనేక కాల్స్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. వీటి ఆధారంగా చందర్‌, జుమ్మన్‌ను విచారించగా.. అసలు మ్యాటర్ చెప్పేశారు.

13 సంవత్సరాల క్రితం మరణించిన వీర్ బహదూర్ వర్మకు చెందిన గార్మెంట్ షాప్‌లో పనిలో చేరానని, అప్పటి నుంచి అక్కడే పని చేశానని చందర్ కాలా చెప్పింది. అయితే, ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను ఎంత టార్చర్ పెట్టినా భరించానని తెలిపింది. చివరకు అతనికి పెళ్లి అయి భార్య, పిల్లలు ఉన్నారని తెలిసినా అతన్ని పెళ్లి చేసుకుంది. అతనికి రెండవ భార్యగా అతని లైఫ్‌లోకి ఎంటరైంది. అయితే, వీర్ బహదూర్‌కు వీరిద్దరే కాకుండా.. మరికొంతమంది మహిళలతోనూ వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న కష్టాలను గార్మెంట షాపులో పని చేసే నర్గీస్ అనే మహిళతో పంచుకోగా.. ఆమె తన అన్న జుమ్మన్ ను పరిచయం చేసుకుంది. నేరస్తుడైన జుమ్మన్‌కు రూ. 1.5 లక్షలు ఇచ్చి.. తన భర్తను చంపేయాల్సిందిగా కోరింది. ఆ డీల్ మేరకు వీర్ బహదూర్‌ను హతమార్చేందుకు జుమ్మన్ ప్లాన్ వేశాడు. మే 18వ తేదీన ఇంటి తలుపులు ఓపెన్ చేసి ఉంచింది చందర్ కాలా. ఇంట్లోకి ఎంటరైన జుమ్మన్.. వీర్ బహదూర్‌ తలపై సుత్తితో మోది హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. విచారణలో పూర్తి వివరాలు తెలియడంలో పోలీసులు చందర్ కాలా, జుమ్మన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu