AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Rains: దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలు.. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో వర్షపాతం .. మరో రెండు రోజుల ఇదే తరహాలో..

అడపా దడపా కాదు. ఈ యేడాది ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. రికార్డుస్థాయిలో కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. మొన్న బెంగుళూరు, ఆ తరువాత ఢిల్లీ...

Delhi Rains: దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలు.. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో వర్షపాతం .. మరో రెండు రోజుల ఇదే తరహాలో..
Delhi Rains
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2022 | 12:58 PM

Share

దేశరాజధాని ఢిల్లీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. గత దశాబ్దకాలంలో ఢిల్లీలో అక్టోబరులో ఈసారి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌లతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ని ధౌలా కువాన్‌, నజాఫ్‌గఢ్‌, నరైనా, రింగ్‌ రోడ్‌, తీన్‌ మూర్తి మార్గ్‌తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధిక వర్షపాతం కురిసిందని ఐఎండి తెలిపింది.

2007 తర్వాత ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. మరో రెండు రోజుల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. శనివారం నుంచి ఇప్పటి వరకు 74 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.వర్షాల కారణంగా ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ తగ్గి.. 23.4 డిగ్రీలుగా నమోదైందని ఐఎండి అధికారులు తెలిపారు. ఇది సీజన్‌లో సగటు కంటే తక్కువగా ఉందని అన్నారు. గాలి నాణ్యత మెరుగుపడిందని అధికారులు తెలిపారు.

భారీ వర్షాలలతో ఢిల్లీ శివార్ల లోని గురుగ్రామ్‌ , నోయిడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం