రాజధానికి ఉగ్ర ముప్పు.. హై అలర్ట్..!

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ విధించినట్లు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రాజధానికి ఉగ్ర ముప్పు.. హై అలర్ట్..!
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2020 | 12:12 PM

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ విధించారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు మార్కెట్‌, ఆసుపత్రి ఏరియాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఢిల్లీలోని క్రైం ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

కాగా భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయ ప్రాంతంలో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి ప్రవేశించే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఇదిలా ఉంటే సరిహద్దు వెంట పాకిస్తాన్ తన బుద్ధిని పోనిచ్చుకోవట్లేదు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి ఆ దేశం తూట్లు పొడిచింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, పాక్ ఆర్మీ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక భారత జవాన్ వీరమరణం పొందారు. ఇక మరోవైపు జమ్ములో రెండు ప్రదేశాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతాబలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Read This Story Also: మళ్లీ కడప సెంట్రల్‌ జైలుకి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి