కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలంటే.. మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్ .

గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ,  ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ..

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలంటే.. మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్  .
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2020 | 1:23 PM

గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ,  ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సూచించారు. వారికి ఏం తక్కువ చేసినా ఈ దేశ ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం చేసినట్టే అవుతుందని, ఈ తరుణానికి తగినట్టు నడచుకోకపోతే అది ద్రోహం కాక మరేమవుతుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తానేం మాట్లాడుతున్నారన్న దానిపై సదా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. లదాఖ్ లో ఇటీవల ఇండో-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణపై మొదటిసారిగా స్పందించిన మన్మోహన్  సింగ్… ఈ సమయంలో  పభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు మన భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించారు. ఈ ప్రజాస్వామ్యంలో బాధ్యత అన్నది పూర్తిగా ప్రధాని పైనే ఉంటుందని, దేశ భద్రత, ప్రాదేశిక ప్రయోజనాలపై మాట్లాడేటప్పుడు ప్రధాన మంత్రి తన మాటల ప్రభావాన్ని ఒకసారి మదింపు చేసుకోవాలని, అప్రమత్తత అవసరమని ఆయన పేర్కొన్నారు. గత శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన మోదీ.. మన భూభాగంలో ఎవరూ (చైనా దళాలు) లేరని, అలాగే మన సైనిక పోస్టుల్లో వేటినీ స్వాధీనం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. . దీనిపై వెంటనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ.. మరి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు పెరిగాయని ప్ప్రశ్నించింది. ప్రధాని మాటలను బట్టి చూస్తే.. మన భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకున్నట్టు ఉందని విపక్షాలు విమర్శించాయి. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆ తరువాత వివరణ ఇస్తూ.. మోదీ వ్యాఖ్యలకు అపోహలను ఆపాదించే విధంగా విమర్శలు చేస్తున్నారని, లదాఖ్ లో నియంత్రణ రేఖ వద్ద నాడున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారని స్పష్టం చేసింది. అక్కడి యధాతథ పరిస్థితిపై విదేశాంగ శాఖ ఇఛ్చిన వివరణనే ఆయన గుర్తు చేశారని, అంతే తప్ప.. మన భూభాగాలను చైనా ఆక్రమించుకున్నట్టు ఆయన చెప్పనేలేదని క్లారిటీ ఇచ్చింది.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ