మారని పాక్ తీరు.. జవాన్ వీరమరణం…

ఒకవైపు భారత్, చైనా దళాల మధ్య తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. దాయాది దేశం పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.

మారని పాక్ తీరు.. జవాన్ వీరమరణం...
Follow us

|

Updated on: Jun 22, 2020 | 12:05 PM

ఒకవైపు భారత్, చైనా దళాల మధ్య తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. దాయాది దేశం పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. డిఫెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ తెల్లవారుజామున 5. 30 గంటలకు పాకిస్తాన్ సైనికులు రెండుసార్లు సరిహద్దుల్లోని కృష్ణఘటి, నౌషెరా రాజౌరీ సెక్టార్లలో నియంత్రణ రేఖ(LOC) వెంబడి కాల్పులకు తెగబడ్డారు. పాక్ బలగాల ఫైరింగ్‌లో నియంత్రణ రేఖకు కాపలాగా ఉన్న ఓ భారత జవాన్ ప్రాణాలు విడిచారు.

దీనితో భారత బలగాలు నియంత్రణ రేఖ చుట్టూ ఉన్న పాక్ సైనికుల పోస్టులు, స్థానాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెలలో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ దళాలు కాల్పులలో నలుగురు భారతీయ సైనికులు మరణించారు. కాగా, మరో పక్క జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోంది.