భువనగిరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్
భువనగిరి పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కిడ్నీలో స్టోన్స్ రావడంతో ఆపరేషన్ నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని బాధితుడు ఆశ్రయించాడు. వైద్యులు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఆపరేషన్‌కు వైద్యులు నిరాకరించారు. చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరేందుకు వెళ్తే బెడ్స్ ఖాళీ లేవనడంతో అర్ధరాత్రి యువకుడు తిరిగి ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకుని […]

భువనగిరి పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కిడ్నీలో స్టోన్స్ రావడంతో ఆపరేషన్ నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని బాధితుడు ఆశ్రయించాడు. వైద్యులు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఆపరేషన్‌కు వైద్యులు నిరాకరించారు.
చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరేందుకు వెళ్తే బెడ్స్ ఖాళీ లేవనడంతో అర్ధరాత్రి యువకుడు తిరిగి ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకుని వైద్య సిబ్బంది.. బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించింది . ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న బాధితుడు.




