ఢిల్లీలో మళ్ళీ మెట్రో సర్వీసులు ? సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో ట్రయల్ బేసిస్ పై మళ్ళీ మెట్రో సర్వీసులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సిటీలో కోవిడ్ పరిస్థితి మెరుగుపడుతోందని, మెట్రో సర్వీసుల..

  • Umakanth Rao
  • Publish Date - 8:41 pm, Sun, 23 August 20
ఢిల్లీలో మళ్ళీ మెట్రో సర్వీసులు ? సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో ట్రయల్ బేసిస్ పై మళ్ళీ మెట్రో సర్వీసులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సిటీలో కోవిడ్ పరిస్థితి మెరుగుపడుతోందని, మెట్రో సర్వీసుల పునరుధ్దరణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. మెట్రో సర్వీసులను ప్రయోగాత్మకంగా దశలవారీగా ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ నగరంలో కోవిడ్ పరిస్థితి చాలా మెరుగు పడిందన్నారు. అయితే ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 1450 కొత్తగా  కరోణవైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,300 మంది కరోనా రోగులు మృతి చెందారు.