సుశాంత్ కేసులో ఇద్దరిని విచారించిన సీబీఐ

సుశాంత్ సింగ్ డెత్ కేసులో సీబీఐ అధికారులు ఆదివారం ఇద్దరిని విచారించారు. సుశాంత్ ఇంటి హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ని, ఆయన మాజీ మేనేజర్ సిద్దార్థ్ పితానిని వారు ప్రశ్నించారు. నీరజ్ ని వారు..

సుశాంత్ కేసులో ఇద్దరిని విచారించిన సీబీఐ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 8:25 PM

సుశాంత్ సింగ్ డెత్ కేసులో సీబీఐ అధికారులు ఆదివారం ఇద్దరిని విచారించారు. సుశాంత్ ఇంటి హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ని, ఆయన మాజీ మేనేజర్ సిద్దార్థ్ పితానిని వారు ప్రశ్నించారు. నీరజ్ ని వారు  ఇంటరాగేట్ చేయడం వరుసగా ఇది మూడో  రోజు. కాగా.. సుశాంత్ సూసైడ్ చేసుకున్న రోజున అతడి గదిని తానే మొదట చూశానని పితాని చెప్పినట్టు తెలుస్తోంది.  సుశాంత్  ఇంటి హౌస్ కీపర్ నీరజ్ ని అధికారులు చాలాసేపు విచారించారు. అటు- సీబీఐ బృందం ఈ రోజు కూడా ముంబైలో సుశాంత్ ఇంటిని సందర్శించి మరిన్ని వివరాలు సేకరించింది. ఇలా ఉండగా ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన నలుగురు సభ్యుల ఫోరెన్సిక్ బృందం రేపో మాపో ముంబైని విజిట్ చేసి సుశాంత్ ఆటాప్సీ రిపోర్టును పరిశీలించననుంది;

Latest Articles