AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Booking App: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

మద్యం ప్రియులకు ఢిల్లీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న రద్దీని నియంత్రించే చర్యల్లో భాగంగా ఢిల్లీ లిక్కర్ బుకింగ్ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానంలో మద్యాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

Liquor Booking App: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
Delhi Liquor Online Booking App
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Oct 28, 2026 | 1:07 PM

Share

ఢిల్లీలో మద్యం విక్రయాల్లో దుకాణాల వద్ద రద్దీని తగ్గించి, కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DSIIDC) ఢిల్లీ లిక్కర్ బుకింగ్ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానంలో మద్యం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇంటికి డెలివరీ సౌకర్యం మాత్రం లేదు. కస్టమర్లు బుకింగ్ చేసిన తర్వాత స్వయంగా దుకాణానికి వెళ్లి బాటిళ్లు తీసుకోవాల్సి ఉంటుంది.

వినియోగదారులు యాప్‌లో తమకు కావలసిన బ్రాండ్‌ను ఎంచుకుని, బాటిల్ సైజ్, క్వాంటిటీ సెలెక్ట్ చేసి ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత యాప్‌లో ఒక ప్రత్యేక QR కోడ్ జనరేట్ అవుతుంది. బుకింగ్ చేసిన 48 గంటల్లోగా సంబంధిత దుకాణానికి వెళ్లి, అక్కడి సిబ్బందికి ఈ QR కోడ్ చూపించి బాటిళ్లను తీసుకెళ్లాలి. మద్యం కొనుగోలు నిబంధనల ప్రకారం ఈ యాప్‌ను ఉపయోగించడానికి వినియోగదారుల వయస్సు కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి.

ప్రస్తుతానికి ఈ సదుపాయం DSIIDC ఆధ్వర్యంలో నడుస్తున్న 208 మద్యం దుకాణాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక వ్యక్తి గరిష్టంగా 9 లీటర్ల విస్కీ, స్పిరిట్స్, 18 లీటర్ల బీర్ కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ లో పికప్ చేసే ముందు బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చు. అయితే ఒకసారి తీసుకున్న తర్వాత రిటర్న్ సౌకర్యం ఉండదు. మద్యం దుకాణాల ముందు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా, వినియోగదారులకు సమయం ఆదా చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా స్టాక్ అందుబాటును ముందుగానే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us