Viral Video: రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. బానెట్‌పై పడినా కనికరం లేకుండా.. షాకింగ్ వీడియో
Delhi Hit-And-Run Case: దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాధితుడు పైకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు.
Delhi Hit-And-Run Case: దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాధితుడు పైకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ డ్రైవర్.. కారును ఆపలేదు.. కారు బానెట్‌పై బాధితుడు వేలాడుతున్నా.. డ్రైవర్ 200 మీటర్ల దూరం పాటు అలానే కారును నడిపాడు. అనంతరం బాధితుడు కిందపడగానే.. అక్కడి నుంచి సైడ్ తీసుకోని పరారయ్యాడు. ఈ షాకింగ్ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో (Hit-And-Run) జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాధిత వ్యక్తికి తీవ్రగాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఘటన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో (Hit-Run Incident Video) రికార్డు అయింది. బాధిత వ్యక్తి ఆనంద్ విజయ్ మండెలియా (37) గా పోలీసులు (Delhi Police) గుర్తించారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు.
కాగా.. ఈ ఘటనలో 37 ఏళ్ల న్యాయ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడైన రాజ్ సుందరంను హర్యానాలోని గురుగ్రామ్‌లోని లే మెరిడియన్ హోటల్ వెలుపల అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) బెనిటా మేరీ జైకర్ తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
వీడియో..
Delhi Police have found a CCTV footage which shows Sunderam driving his newly purchased Volkswagen at very high speeds and dragging the victim on the bonnet for nearly 200 metres before fleeing the spot.https://t.co/7M0FCAwJVk pic.twitter.com/MSAKl9ODCe
— Express Delhi-NCR ? (@ieDelhi) February 11, 2022
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కారు బానెట్ వ్యక్తి ఉన్నప్పటికీ.. కారు వేగంగా దూసుకెళుతుండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అతను పడిన అనంతరం కూడా కారు పక్క నుంచి దూసుకెళ్లడం కూడా కెమెరాలో రికార్డయింది. కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెజటిన్లు కోరుతున్నారు.
Also Read: