ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కేజ్రీకి దిశ చట్టమే కీలకం..!
వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘దిశ చట్టం 2019’ను అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా కామాంధులకు 21 రోజుల్లో ఉరి శిక్షను విధించనున్నారు. కాగా, మహిళల భద్రత కోసం ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. ఇకపోతే జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఢిల్లీ, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు […]
వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘దిశ చట్టం 2019’ను అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా కామాంధులకు 21 రోజుల్లో ఉరి శిక్షను విధించనున్నారు. కాగా, మహిళల భద్రత కోసం ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.
ఇకపోతే జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఢిల్లీ, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు అభినందనలు తెలపడమే కాకుండా ఆ చట్టానికి సంబంధించిన ప్రతులను కూడా తెప్పించుకుని వాటిపై అధ్యయనం మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే రెండు మూడు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలుపొందానికి ఏపీలో అమలు చేసిన దిశ చట్టాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించాలని యోచిస్తోందట.
ఏపీ దిశ చట్టాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని.. దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో కమిటీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో అత్యాచారాలు పెరిగిపోవడంతో దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే మహిళలపై నేరాలను అరికట్టవచ్చునని వారు భావిస్తున్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నిజంగానే దీన్ని ప్రచారాస్త్రంగా వాడితే మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టడానికి గల అవకాశాలు మెండుగా ఉంటాయన్నది విశ్లేషకుల భావన.