పౌరసత్వ చట్టం రద్దుకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. ఆమోదం
వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పాలక సీపీఐ (ఎం)-ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఈ తీర్మానాన్ని సమర్థించాయి. అయితే బీజేపీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన ఒ. రాజగోపాల్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టం రద్దు తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీని సమావేశపరచడం విశేషం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ.. […]
వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పాలక సీపీఐ (ఎం)-ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఈ తీర్మానాన్ని సమర్థించాయి. అయితే బీజేపీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన ఒ. రాజగోపాల్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టం రద్దు తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీని సమావేశపరచడం విశేషం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ.. ఈ చట్టం దేశ సెక్యులర్ వ్యవస్థకు వ్యతిరేకమని, పౌరసత్వ కల్పనలో ఇది మత వివక్షను చూపేదిగా ఉందని విమర్శించారు. రాజ్యాంగంలోని మౌలిక విలువలు, సూత్రాలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన.. ఈ దేశ ప్రజల ఆందోళన దృష్ట్యా కేంద్రం దీన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఇది భారత ప్రతిష్టను దిగజార్చిందని విజయన్ ఆరోపించారు. పైగా కేరళలో ఎలాంటి డిటెన్షన్ సెంటర్లు ఉండవని ఆయన సభకు హామీ ఇచ్చారు. సీఏఏ ను నిరసిస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.