AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాక్‌లో సుజనా.. నెక్స్ట్ స్టెప్ ఇదే!

ఏపీ కమలంలో కన్ఫ్యూజన్ రెట్టింపయ్యిందా? క్యాపిటల్ కాంట్రవర్సీలో నేతలంతా తలోరకంగా మాట్లాడుతుండడంతో అధిష్టానం అందరికీ ఒకేసారి చెక్ పెట్టాలని భావించి, జీవిఎల్ అనే అస్త్రాన్ని హస్తినాపురం నుంచి సంధించిందా? ఇవన్నీ నిజమే అయితే ఏపీ బీజేపీకి తానే పెద్ద దిక్కుగా భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పరిస్థితి ఏంటిప్పుడు? ఏపీవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ చర్చ. ఏపీకి మూడు రాజధానులుండే అవకాశముంది అంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసినప్పట్నించి అమరావతి తరలింపును […]

షాక్‌లో సుజనా.. నెక్స్ట్ స్టెప్ ఇదే!
Rajesh Sharma
|

Updated on: Dec 31, 2019 | 7:51 PM

Share

ఏపీ కమలంలో కన్ఫ్యూజన్ రెట్టింపయ్యిందా? క్యాపిటల్ కాంట్రవర్సీలో నేతలంతా తలోరకంగా మాట్లాడుతుండడంతో అధిష్టానం అందరికీ ఒకేసారి చెక్ పెట్టాలని భావించి, జీవిఎల్ అనే అస్త్రాన్ని హస్తినాపురం నుంచి సంధించిందా? ఇవన్నీ నిజమే అయితే ఏపీ బీజేపీకి తానే పెద్ద దిక్కుగా భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పరిస్థితి ఏంటిప్పుడు? ఏపీవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ చర్చ.

ఏపీకి మూడు రాజధానులుండే అవకాశముంది అంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసినప్పట్నించి అమరావతి తరలింపును అంగీకరించేది లేదని చెబుతూ వచ్చిన సుజనాచౌదరికి షాకిచ్చారు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు. ‘‘అధికార ప్రతినిధిగా చెబుతున్నా.. అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంలో కేంద్రం జోక్యం వుండదు.. అసలా చాన్సే లేదు‘‘ సరిగ్గా ఇదే జీవీఎల్ నరసింహారావు సోమవారం చేసిన ప్రకటన.

గత 14 రోజులుగా పలు సందర్భాలలో సుజనా చౌదరి చేసిన ప్రకటనకు ఆల్‌మోస్ట్ అపోజిట్ స్టేట్‌మెంట్ ఇది. గుంటూరు జిల్లాలో పర్యటించిన సందర్భంలోనైనా, అమరావతి ప్రాంత రైతులు తనను కలిసిన సందర్భంలోనైనా.. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంలోనైనా సుజనా చౌదరి రాజధాని తరలింపును బీజేపీ వ్యతిరేకిస్తుందని, అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెబుతూ వచ్చారు. మరి తాజాగా జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటన తర్వాత సుజనా ఏం చెబుతారన్నది ప్రశ్నగా మారింది.

కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహిత పరిచయం.. ఇలా ఎన్నో క్వాలిటీలతో ఏపీ బీజేపీకి తానే పెద్ద దిక్కని భావిస్తున్న సుజనా సోమవారం నాడు జీవీఎల్ ప్రకటన తర్వాత నోరు మెదపడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే జీవీఎల్ నరసింహారావు ఖరాఖండీగా ప్రకటన చేశారని పలువురు భావిస్తున్నారు. రోజురోజు ప్రకటనలతో ముఖ్యమంత్రి జగన్‌కు ఎంబరాసింగ్ క్రియేట్ చేస్తున్న సుజనా నోరు మూయించేందుకు బీజేపీ అధిష్టానం జీవీఎల్ అస్త్రాన్ని వదిలిందా అన్న చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. ఇందుకు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చేసిన దౌత్యమే కారణమా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు మాటను సుజనాచౌదరి నోట వింటున్నామంటూ విజయసాయి కామెంట్ చేశారు. అదే అంశాన్ని బీజేపీ జాతీయ నేతల దృష్టికి ఆయన తీసుకెళ్ళినట్లు సమాచారం.

2014-2018 మధ్యకాలంలో ఏపీలో సుజనాచౌదరి బాగానే చక్రం తిప్పారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఆయన ప్రమేయం చాలా మటుకు కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి రాజధాని తరలింపును వ్యతిరేకించడం అత్యంత సహజం. అయితే, తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా ఆయన చెప్పుకోవడం వల్లనే బీజేపీ అధిష్టానం ఆయనకు చెక్ పెట్టి వుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి క్యాపిటల్ తరలింపుగానీ, అధికార వికేంద్రీకరణ గానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఈ విషయంలో కేంద్రం సలహాలు, అవసరం మేరకు, పరిమితుల మేరకు ఆర్థిక సాయం మాత్రమే చేయగలదు. దాదాపు అదే అంశాన్ని జీవీఎల్ వెల్లడించారు.

గుంటూరు జిల్లాకే చెందిన సుజనాచౌదరి, బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని తరలింపును, వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారు. కర్నూలుకు చెందిన మరో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ మూడు రాజధానుల కాన్సెప్టును స్వాగతిస్తున్నారు. ఇలా ఏపీ బీజేపీలో ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడుతూ అసలు పార్టీ స్టాండ్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం జీవీఎల్ నోటి వెంట పార్టీ స్టాండ్ వెల్లడించి వుంటుందని అంఛనా వేస్తున్నారు. అయితే ఇది సుజనా పాలిటిక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాలి.