సీఏఏ నిరసనలు.. యూపీ నోటీసుల వెనుక మర్మమిటో ?

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దిగిన 372 మందికి యూపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు మీ ఆస్తులను ఎందుకు జఫ్తు చేయరాదో సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆ నోటీసుల్లో కోరింది. 2007-2011 మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఆయా సందర్భాల్లో పేర్కొన్న సిఫారసుల ఆధారంగాను, అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పురస్కరించుకుని తామీ చర్య తీసుకుంటున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఒక డైలీ విశ్లేషణ ప్రకారం.. గతంలో జరిగిన […]

సీఏఏ నిరసనలు.. యూపీ నోటీసుల వెనుక మర్మమిటో ?
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 31, 2019 | 5:00 PM

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దిగిన 372 మందికి యూపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు మీ ఆస్తులను ఎందుకు జఫ్తు చేయరాదో సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆ నోటీసుల్లో కోరింది. 2007-2011 మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఆయా సందర్భాల్లో పేర్కొన్న సిఫారసుల ఆధారంగాను, అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పురస్కరించుకుని తామీ చర్య తీసుకుంటున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఒక డైలీ విశ్లేషణ ప్రకారం.. గతంలో జరిగిన ఘర్షణల సందర్భంలో ఆరు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను గమనిస్తే నిరసనకారులపైనో, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించినవారిపైనో ఎలాంటి ‘ ప్రతీకారాన్నీ ‘ తీసుకోలేదని అర్థమవుతోంది.

ఈ సారి ఒక్క యూపీ మినహా.. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా నోటీసులు పంపిన దాఖలాలు లేవు. అసలు యూపీ విషయానికే వస్తే.. బులంద్ షహర్ లో గత ఏడాది డిసెంబరులో సుబోధ్ కుమార్ సింగ్ అనే పోలీసు అధికారిపై దాడి చేసి ఆయనను దారుణంగా హతమార్చడమే గాక.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన ఆందోళనకారులకు యూపీ సర్కార్ నోటీసులు జారీ చేసిందా ? అలాగే 2016 ఫిబ్రవరిలో హర్యానాలో జాట్ కోటా కోసం ఆందోళనలు చేసి ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేసినవారిపైనా, రాజస్థాన్ లో లోగడ ‘ పద్మావత్ ‘ మూవీకి వ్యతిరేకంగా హింసాత్మక దాడులకు పాల్పడినవారిపైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ఈ డైలీ ప్రశ్నించింది. తాజాగా యూపీలో యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం ‘సిఏఏ ‘ ను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగినవారి ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేయడం..కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ సూచనలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఈ చట్టాన్ని వ్యతిరేకించే ఎవరైనా ఇక భయంతో వెనుకంజ వేస్తారన్నది యూపీ వ్యూహంగా కూడా తెలుస్తున్నది.