ఆ చట్టం మంచిదే.. సద్గురు జగ్గీ వాసుదేవ్ కితాబు
సవరించిన పౌరసత్వ చట్టం, ఎన్నార్సీలకు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పూర్తి మద్దతును ప్రకటించారు. ఇలాంటి చట్టాలను ప్రభుత్వం ఏనాడో చేపట్టవలసి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు (చట్టం) మతపరమైన వేధింపులను అరికట్టడానికి మాత్రమే ఉద్దేశించినదన్నారు. ఈ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న అల్లర్లను చూస్తుంటే ఏమనాలో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. . ‘ ప్రజలు ప్రమాదకరమైన ‘ ఆటలు ‘ ఆడుతున్నారు. కొంతమందిలో నైరాశ్యం ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు ఈ […]
సవరించిన పౌరసత్వ చట్టం, ఎన్నార్సీలకు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పూర్తి మద్దతును ప్రకటించారు. ఇలాంటి చట్టాలను ప్రభుత్వం ఏనాడో చేపట్టవలసి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు (చట్టం) మతపరమైన వేధింపులను అరికట్టడానికి మాత్రమే ఉద్దేశించినదన్నారు. ఈ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న అల్లర్లను చూస్తుంటే ఏమనాలో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. . ‘ ప్రజలు ప్రమాదకరమైన ‘ ఆటలు ‘ ఆడుతున్నారు. కొంతమందిలో నైరాశ్యం ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు ఈ దేశంలోని ముస్లిములకు తాము భారతీయ పౌరసత్వం కోల్పోతామేమోనన్న భయం ఎందుకు ‘ అని ఈ సద్గురువు ప్రశ్నించారు. ఇలాంటి అపోహలు తగవన్నారు. ఇది దురదృష్టకరమని, ఈ రోజుల్లో కూడా కేవలం మన ఫోన్ ఎత్తి ఈ చట్టం గురించి చదివితే అసలు విషయం తెలుస్తుందని, యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు కూడా నిరక్షరాస్యుల్లాగా బిహేవ్ చేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ యాక్ట్ గురించి చదివిన ఏ విద్యార్ధి అయినా ఏమీ చదవనివాడిలా వీధుల్లోకి వచ్చి.. ఘర్షణలకు దిగడం విచారకరం అన్నారాయన.
Do hear this lucid explanation of aspects relating to CAA and more by @SadhguruJV.
He provides historical context, brilliantly highlights our culture of brotherhood. He also calls out the misinformation by vested interest groups. #IndiaSupportsCAA https://t.co/97CW4EQZ7Z
— Narendra Modi (@narendramodi) December 30, 2019