Covid Vaccine: కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీలో 24 గంటలపాటు కరోనా వ్యాక్సినేషన్
24 Hours Covid Vaccination in Delhi: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న కేసుల సంఖ్య లక్షదాటిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, కేరళ ప్రాంతాలల్లో కేసులు భారీగా
24 Hours Covid Vaccination in Delhi: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న కేసుల సంఖ్య లక్షదాటిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, కేరళ ప్రాంతాలల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉధృతి భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు తీసుకుంది. టీకా కార్యక్రమంలో కీలక మార్పులు మార్పులు చేస్తూ సోమవారం కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 24గంటల పాటు వ్యాక్సిన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ ఉత్తర్వులు అన్ని టీకా కేంద్రాలకు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడో వంతు ఆసుపత్రులు రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకూ పని చేస్తాయని తెలిపింది. ప్రస్తుతం రాజధానిలో ప్రభుత్వం, ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ ఆరోగ్య సిబ్బంది… ప్రజలకు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇకపై ఏ సమయంలోనైనా టీకా తీసుకునే సౌలభ్యం కలగనుంది.
రాజధానిలో ఆదివారం నాడు కొత్తగా 4 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితమే కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: