Arvind Kejriwal: ముగిసిన బెయిల్‌ గడువు.. తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోనున్న ఢిల్లీ సీఎం

లిక్కర్‌ కేసులో మార్చి 21న అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 49రోజుల జైలుజీవితం తర్వాత మే 10న బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌ ఇచ్చిన రోజే జూన్‌ రెండున మళ్లీ సరెండర్‌ కావాలని ఆదేశించింది.

Arvind Kejriwal: ముగిసిన బెయిల్‌ గడువు.. తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోనున్న ఢిల్లీ సీఎం
Arvind Kejriwal
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 02, 2024 | 11:07 AM

లిక్కర్‌ కేసులో మార్చి 21న అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 49రోజుల జైలుజీవితం తర్వాత మే 10న బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌ ఇచ్చిన రోజే జూన్‌ రెండున మళ్లీ సరెండర్‌ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి… కేజ్రీవాల్‌కు సుప్రీం ఇచ్చిన గడువూ ముగిసింది… దాంతో, ఇవాళ తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, అనారోగ్య కారణాలతో బెయిల్‌ పొడిగించాలని కోరినా… పిటిషన్‌ను కనీసం లిస్ట్‌ చేయడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. దాంతో, ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్‌. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు… తీర్పును రిజర్వు చేయడంతో ఈరోజు లొంగిపోక తప్పని పరిస్థితి వచ్చింది.

లిక్కర్‌ కేసులో మార్చి 21న అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 49రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌ ఇచ్చిన రోజే జూన్‌ రెండున మళ్లీ సరెండర్‌ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి.. కేజ్రీవాల్‌కు సుప్రీం ఇచ్చిన గడువూ ముగిసింది. దాంతో, ఇవాళ తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, అనారోగ్య కారణాలతో బెయిల్‌ పొడిగించాలని కోరినా పిటిషన్‌ను కనీసం లిస్ట్‌ చేయడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. దాంతో ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్‌. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు.. తీర్పును రిజర్వు చేయడంతో ఈరోజు లొంగిపోక తప్పని పరిస్థితి వచ్చింది.

కాగా, తీహార్ వెళ్లి లొంగిపోతానని చెప్పిన కేజ్రీవాల్.. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తానని తెలిపారు. అక్కడి నుంచి కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ జీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలను కలుస్తారు. అక్కడి నుంచి మళ్లీ తీహార్‌కు బయలుదేరుతారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

అంతకుముందు శనివారం, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రూస్ అవెన్యూ కోర్టు తన నిర్ణయాన్ని జూన్ 5కి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తిరిగి తీహార్ జైలుకు వెళ్లనున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా, వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారని, సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం కాదని పేర్కొంటూ ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. అదే సమయంలో, కేజ్రీవాల్ తరపు న్యాయవాది శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేయాలని పట్టుబట్టారు. కేజ్రీవాల్ ఆదివారం లొంగిపోవాలని వాదించారు. అయితే అతని అభ్యర్థనను న్యాయమూర్తి అంగీకరించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!