Lok Sabha Election Exit Poll 2024: ‘పనికిరాని చర్చ, సమయం వృధా…’, ఎగ్జిట్ పోల్‌పై స్పందించిన ప్రశాంత్ కిషోర్

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత, ఎన్నికల వ్యూహకర్త, విశ్లేషకుడు, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల సమయాన్ని వృధా చేశాయన్నారు. ఇది పనికిరాని చర్చ అంటూ మీడియాను కూడా టార్గెట్ చేశాడు.

Lok Sabha Election Exit Poll 2024: 'పనికిరాని చర్చ, సమయం వృధా...', ఎగ్జిట్ పోల్‌పై స్పందించిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 02, 2024 | 11:31 AM

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత, ఎన్నికల వ్యూహకర్త, విశ్లేషకుడు, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల సమయాన్ని వృధా చేశాయన్నారు. ఇది పనికిరాని చర్చ అంటూ మీడియాను కూడా టార్గెట్ చేశాడు.

అదే సమయంలో, ప్రశాంత్ కిషోర్, ఎన్నికలు ముగిసిన తర్వాత, రాజకీయాల విషయానికి వస్తే, బూటకపు జర్నలిస్టులు, మతోన్మాద రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో స్వయం ప్రకటిత నిపుణుల విశ్లేషణలు, పనికిమాలిన చర్చలతో మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. అంటూ ఘాటుగా కామెంట్ చేశారు.

అయితే బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందని ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు ప్రకటించారు. బీజేపీకి పోయినసారి లాగా 303 సీట్లు వస్తాయి.. లేదంటే పెరుగుతాయంటూ ఇటీవల పలు టీవీ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. నిజానికి, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మెజారిటీ వస్తాయని అంచనా వేసింది.

శనివారం (జూన్ 1) వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజల నేతృత్వంలోని ఎన్డీయే భారీ మెజారిటీ సాధిస్తుందని అంచనా. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్‌ తన విజయాన్ని ఎవరు ఆపలేరంటోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగలదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న సీట్ల సంఖ్యకు సమానం లేదా కొంచెం ఎక్కువగా ఉంటుందని జన్ సూరజ్ పార్టీ అధినేత వాదిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ 2024 ఫలితాలు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు, ప్రముఖ మీడియా సంభాషణలో, లోక్‌సభ ఎన్నికల్లో BJP నేతృత్వంలోని NDA పనితీరుపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను పునరుద్ఘాటించారు.

ఇదిలావుంటే, దేశంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని పలు మీడియా సంస్థల ఓటర్ల ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని NDA కూటమి వైపు మొగ్గుచూపాయి. టీవీ9 సర్వేలో ఎన్డీయేకు 341 సీట్లు వస్తాయని అంచనా. ఇండియా కూటమి 166 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది టీవీ9.

మరోసారి ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం వికసించే ఛాన్స్‌ ఉందని ప్రకటించాయి. కర్నాటకలో కూడా NDA కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీవీ9 భారత్‌ వర్ష్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమికి 20, ఇండియా కూటమికి 8 సీట్లు లభించే ఛాన్స్‌ ఉంది. ఇటు తెలంగాణలో కూడా బీజేపీ గతం కంటే ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్‌ ఉందని టీవీ9 భారత్‌ వర్ష్‌ ఎగ్జిట్‌ పోల్‌ తేల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..