Delhi Elections: ఢిల్లీలో 92శాతం పోలింగ్ నమోదు.. ఇంతకీ ఏ ఎన్నికల్లోనో తెలుసా..?

ఢిల్లీ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో 92% పోలింగ్ నమోదైంది. అదేంటి.. ఇంకా పోలింగ్ ప్రారంభమే కాలేదు.. అప్పుడే పోలింగ్ శాతం ఇంత ఎలా నమోదవుతుందని అనుకుంటున్నారా?.. అవును ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5 (బుధవారం) ఉదయం గం. 7.00కు ప్రారంభమై సాయంత్రం గం. 6.00 వరకు కొనసాగనుంది.

Delhi Elections: ఢిల్లీలో 92శాతం పోలింగ్ నమోదు.. ఇంతకీ ఏ ఎన్నికల్లోనో తెలుసా..?
Delhi Assembly Election
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 04, 2025 | 4:27 PM

ఢిల్లీ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో 92% పోలింగ్ నమోదైంది. అదేంటి.. ఇంకా పోలింగ్ ప్రారంభమే కాలేదు.. అప్పుడే పోలింగ్ శాతం ఇంత ఎలా నమోదవుతుందని అనుకుంటున్నారా?.. అవును ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5 (బుధవారం) ఉదయం గం. 7.00కు ప్రారంభమై సాయంత్రం గం. 6.00 వరకు కొనసాగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. కానీ ఈ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ఒక కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే హోం ఓటింగ్ (ఇంటి నుంచే ఓటు వేసే) సదుపాయం. వయో వృద్ధులు, వైకల్యంతో బాధపడుతున్నవారికి ఈ సదుపాయాన్ని కల్పించడం ద్వారా వారు తమ ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఏర్పడింది. సాధారణంగా పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్లలో నిలబడి ఓటు వేసే ఓపిక వృద్ధులకు ఉండదు. అలాగే వైకల్యంతో బాధపడేవారికి సైతం క్యూలైన్లలో ఎదురుచూసి ఓటు వేయడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ వర్గాలు ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకుంటే, పోలింగ్ సిబ్బందే స్వయంగా వారి నివాసాల వద్దకు చేరుకుని ఓటును నమోదు చేసుకుంటారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాలకు పోస్టల్ బ్యాలెట్ విధానం చాలా కాలం నుంచే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తమ ఓటు హక్కు ఒక చోట ఉంటే, ఎలక్షన్ డ్యూటీలో భాగంగా మరో చోట పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వీరికి ఈ తరహా సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. తద్వారా ఆయా ఉద్యోగులు, సాయుధ బలగాల్లో పనిచేసేవారు ముందుగానే తమ వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఓటు హక్కు ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లపై ఓటు వేశాక, వాటిని ఆ నియోజకవర్గాలకు చేర్చుతుంటారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లలో నిక్షిప్తమైన సాధారణ ప్రజల ఓట్లను లెక్కించడానికి ముందు ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తుంటారు.

ఇప్పుడు హోం ఓటింగ్ విధానంలో కూడా ముందుగా తమ పేర్లు నమోదు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి ఓటు వేయిస్తారు. ఈ క్రమంలో సదరు ఓటరుపై ఎలాంటి ఒత్తిడి లేకుండా మొత్తం వ్యవహారాన్ని (ఓటు ఎవరికి వేస్తున్నారన్నది కనిపించకుండా) వీడియో కూడా చిత్రీకరిస్తారు. ఇదంతా పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందే నిర్వహించి, పోలింగ్ తేదీ నాడు పూర్తిగా EVM ద్వారా పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహిస్తారు.

హోం ఓటింగ్ 92% నమోదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సిబ్బంది హోం ఓటింగ్ చేపట్టింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు మొత్తం 7,553 మంది వృద్ధ, దివ్యాంగ ఓటర్లకు అవకాశం ఉంది. వారి ఓట్లను నమోదు చేసే ప్రక్రియను జనవరి 24న ప్రారంభించి ఫిబ్రవరి 4 నాటికి ముగించారు. ఇందులో మొత్తం 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 5,982 మంది వయోధికులు కాగా, 998 మంది దివ్యాంగులు ఉన్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో అత్యధికంగా పశ్చిమ ఢిల్లీలో 94 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ విధానంలో ఓటు వేయకుండా మిగిలిపోయిన ఓటర్లు బుధవారం (ఫిబ్రవరి 5) నాడు జరిగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియలో భాగం కావొచ్చు. ఇలాంటివారి కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 4,218 వీల్ ఛైర్లు, 8,715 మంది వాలంటీర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

పోలింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సాయుధ బలగాలతో భద్రత కోసం 220 కంపెనీల పారామిలటరీ బలగాలు, 19 వేల మంది హోంగార్డులను వినియోగిస్తుంది. వీరంతా అప్పటికే విధుల్లో ఉన్న 35,626 మంది ఢిల్లీ పోలీసులకు అదనం. అలాగే ఎన్నికలకు ఆటంకం కల్గించేవారిని ముందుగానే ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికే 1000కి పైగా కేసులు నమోదుచేయగా, 33,434 మందిని అరెస్టు కూడా చేశారు.

ఇక పోలింగ్ ఏర్పాట్ల విషయానికొస్తే.. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..