AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు మామూలోడు కాదు రా.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

13 ఏళ్ల బాలుడికి విమాన ప్రయాణం ఎలా ఉంటుందనే డౌట్ వచ్చింది. ఎలాగైన ఫ్లైట్ ఎక్కాలనుకున్నాడు. అయితే అతడి దగ్గర డబ్బు లేకపోవడంతో దొడ్డిదారిన భద్రతా అధికారుల కళ్లుగప్పి ఫ్లైట్ ఎక్కాడు. విమానంలోని ఓ మూలన ఎవరికీ కనపడకుండా దాక్కున్నాడు. చివరకు ఎలా చిక్కాడు అంటే..

నువ్వు మామూలోడు కాదు రా.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..
Afghan Boy Hides In Plane's Landing Gear
Krishna S
|

Updated on: Sep 23, 2025 | 7:42 AM

Share

ఓ వైపు విమాన ప్రమాదాలు భయపెడుతుంటే.. కొంతమంది చేసే పనుల వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కొంతమంది విమానంలో రహస్యంగా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అధికారులతో పాటు అంతా అవాక్కయ్యారు. కాబూల్ నుండి బయలుదేరిన ఒక విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఒక 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ అసాధారణ సంఘటన ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో వెలుగులోకి వచ్చింది.

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ నగరానికి చెందిన ఈ బాలుడు కాబూల్ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలోకి చొరబడి KAM ఎయిర్ విమానం RQ-4401 ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్నాడు. ఈ విమానం రెండు గంటల ప్రయాణం తర్వాత ఉదయం 11:00 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం బయటపడింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ బాలుడిని గుర్తించిన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించారు. బాలుడు చెప్పిన విషయాలు విని అధికారులు అవాక్కయ్యారు. ప్రమాదాలను పట్టించుకోకుండా కేవలం ఉత్సుకతతో విమానంలోకి ప్రవేశించానని బాలుడు తెలిపాడు. అదేరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరిన అదే విమానంలో అతన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించారు.

భద్రతా తనిఖీలు

ఈ సంఘటన తరువాత KAM ఎయిర్‌లైన్స్ భద్రతా సిబ్బంది విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో బాలుడికి చెందిన ఒక చిన్న ఎర్రటి స్పీకర్ లభించింది. భద్రతా తనిఖీల అనంతరం విమానం సేఫ్ అని నిర్ధారించారు. ఈ సంఘటన విమానాశ్రయ భద్రతా లోపాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..