ఉగ్రవాదులతో చేతులు కలిపిన పోలీస్..ఖాకీలకే షాక్

ఓ ఖాకీ ముసుగులో టెర్రరిస్టు దాగున్నాడంటే నమ్మలేం.. పోలీసోడే టెర్రరిస్టు రూపంలో ఖాకీ దుస్తులు ధరించి ఉన్నాడంటే అది అస్సలు నమ్మలేం. కానీ జరిగింది మాత్రం ఇది ! ఆ పోలీసు అధికారి సాదాసీదావాడు కాదు. అతగాడు గత ఏడాది ఆగస్టు 15 న రాష్ట్రపతి చేతులమీదుగా పోలీస్ గ్యాలంట్రీ అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి టెర్రరిస్టులతో చేతులు కలపడం పోలీసు వర్గాలను షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకాశ్మీర్లో కీలకమైన శ్రీనగర్ […]

ఉగ్రవాదులతో చేతులు కలిపిన పోలీస్..ఖాకీలకే షాక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 12, 2020 | 11:38 AM

ఓ ఖాకీ ముసుగులో టెర్రరిస్టు దాగున్నాడంటే నమ్మలేం.. పోలీసోడే టెర్రరిస్టు రూపంలో ఖాకీ దుస్తులు ధరించి ఉన్నాడంటే అది అస్సలు నమ్మలేం. కానీ జరిగింది మాత్రం ఇది ! ఆ పోలీసు అధికారి సాదాసీదావాడు కాదు. అతగాడు గత ఏడాది ఆగస్టు 15 న రాష్ట్రపతి చేతులమీదుగా పోలీస్ గ్యాలంట్రీ అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి టెర్రరిస్టులతో చేతులు కలపడం పోలీసు వర్గాలను షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకాశ్మీర్లో కీలకమైన శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధుల్లో ఉన్న దేవేందర్ సింగ్ అనే డీఎస్పీ ఆయన.. ఇతగాడు ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. కుల్గాం జిల్లా వాన్ పో అనే ప్రాంతం వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఖాకీ వెంట నవీన్ అహ్మద్ షా అలియాస్ నవీద్ బాబు అనే ముజాహిదీన్ ఉగ్రవాది, రఫీ అహ్మద్ అనే మరో ఉగ్రవాది కూడా ఉన్నారు. దక్షిణ కాశ్మీర్లో గత అక్టోబరులోనూ, గత ఏడాది నవంబరు లోను కొందరు ట్రక్ డ్రైవర్లు-, కూలీలతో సహా  11 మంది నాన్-లోకల్ వర్కర్లను హతమార్చడంలో నవీద్ బాబు నిందితుడు. (ఈ నవీద్ బాబు కూడా మాజీ పోలీసు అధికారేనట). పోలీసులకు లొంగిపోవలసిందిగా ఈ ఇద్దరు ఉగ్రవాదులకు నచ్ఛజెప్పేందుకే తాను  వీరిని ఢిల్లీకి తీసుకువెళ్తున్నానని దేవేందర్ సింగ్ చెప్పినా.. ఆ ఇద్దరు  టెర్రరిస్టులు మాత్రం మాత్రం అదేమీ కాదని చెప్పారట.

నవీద్ బాబు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు యితడు తన సోదరుడికి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా ఇతని ఆచూకీని కనుగొనగలిగారు. అయితే ఈ ఉగ్రవాది దేవేందర్ సింగ్ తో చేతులు కలిపాడా లేక సింగే ఇతనితో  మిలాఖత్ అయ్యాడా ఆయన విషయం తెలియలేదు. మొత్తానికి దేవేందర్ సింగ్ తో బాటు ఈ ఇద్దరు టెర్రరిస్టులనూ అరెస్టు చేసిన పోలీసులు.. శ్రీనగర్, సౌత్ కాశ్మీర్ ప్రాంతాల్లో పలుచోట్ల దాడులు, సోదాలు చేసి పెద్దయెత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అలాగే దేవేందర్ ఇంటినుంచి ఒక ఎకె-47 రైఫిల్ ని, రెండు గన్స్ ని కూడా హస్తగతం చేసుకున్నారు. దేవేందర్ శనివారం విధులకు డుమ్మా కొట్టాడని, ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు సెలవు కోసం దరఖాస్తు పెట్టాడని తెలిసింది. ఇతని గతంలోకి వెళ్తే.. 2013 లో పార్లమెంటుపై దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురు రాసినట్టు చెబుతున్న లేఖతో ఇతగాడు నాడు టాప్ వార్తలకెక్కాడు. ఆ దాడికి ముందు ఢిల్లీలో తాను ఉండేందుకు వసతి ఏర్పాటు చేయవలసిందిగా అఫ్జల్ గురు ఆ నాడు ఇతనికి ఈ లేఖ రాశాడట.. దాన్ని బయటపెట్టి దేవేందర్ ‘ సాహసోపేత ‘ గ్యాలంట్రీ పోలీసు అవార్డు కొట్టేశాడు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?