AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యుడిపై పెను భారం.. కొండెక్కిన వంట నూనెలు, పప్పుల ధరలు!

ఇప్పటికే పెరిగిన ఉల్లి, వెల్లుల్లి ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడింది. సంక్రాంతి పండగ వేళ ఒక్కసారిగా వంట నూనెలు, పప్పుల రేట్లు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుమతులు తగ్గిపోవడంతో వీటి ధరలుకు రెక్కలు వచ్చాయి. అన్ని రకాల వంట నూనెలూ 15% నుంచి 20% వరకు పెరిగాయి. రూపాయి మారకపు విలువ పడిపోవడంతో పాటుగా దిగుమతి సుంకాలు పెరిగిపోవడం ఈ మార్పుకు ముఖ్య కారణాలయ్యాయి.  అటు రిటైల్ మార్కెట్‌లో అయితే […]

సామాన్యుడిపై పెను భారం.. కొండెక్కిన వంట నూనెలు, పప్పుల ధరలు!
Ravi Kiran
|

Updated on: Jan 13, 2020 | 8:14 AM

Share

ఇప్పటికే పెరిగిన ఉల్లి, వెల్లుల్లి ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడింది. సంక్రాంతి పండగ వేళ ఒక్కసారిగా వంట నూనెలు, పప్పుల రేట్లు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుమతులు తగ్గిపోవడంతో వీటి ధరలుకు రెక్కలు వచ్చాయి. అన్ని రకాల వంట నూనెలూ 15% నుంచి 20% వరకు పెరిగాయి. రూపాయి మారకపు విలువ పడిపోవడంతో పాటుగా దిగుమతి సుంకాలు పెరిగిపోవడం ఈ మార్పుకు ముఖ్య కారణాలయ్యాయి.  అటు రిటైల్ మార్కెట్‌లో అయితే నూనె లీటర్ రూ.5 నుంచి రూ.20 దాకా పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇక అసలే ఇది పండగ సీజన్ దీంతో రాష్ట్రంలో రేట్లు రెండింతలు పెరిగిపోయాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో ప్రస్తుతం రూ.98 నుంచి రూ.100 దాకా పలుకుతుండగా.. పామాయిల్ కిలో రూ.85 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. ఇక వేరుశెనగ నూనె అయితే రూ.120లు ఉంది.

దేశంలో ఏటా 15 మిలియన్ టన్నులకు గానూ 8 మిలియన్ టన్నుల నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో అధిక శాతం మలేషియా, ఇండోనేషియాల నుంచే దిగుమతి అవుతున్నాయి. అయితే ఈ రెండు దేశాలు సుంకాలు పెంచడంతో గణనీయంగా నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి.

వంట నూనెల పరిస్థితి ఇలా ఉంటే.. పప్పు దినుసుల పరిస్థితి మరోలా ఉంది. గతేడాది ఖరీఫ్‌లో కంది పంట 2.60 లక్షల హెక్టార్లకే పరిమితి కావడం.. అంతేకాకుండా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల్లో కూడా వర్షాల వల్ల సాగు తగ్గిపోవడంతో దిగుమతులు పడిపోయాయి. మరోవైపు పప్పు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా దిగుబడి ఇదే రీతిలో ఉండటంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ధరలు భగ్గుమన్నాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.95-102 మధ్య ఉండగా.. నల్గొండలో రూ.102, మహబూబ్‌నగర్‌లో రూ.100గా ఉంది. గతేడాది కిలో రూ.76-80 పలకగా.. ఆ రేట్‌తో పోలిస్తే ఇప్పుడు సుమారు రూ.20 పెరిగింది. అటు పెసరపప్పు, మినపప్పు ధరలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. కిలో పెసరపప్పు రూ.105కు విక్రయిస్తుండగా.. మినపప్పు రూ.115-120 మధ్యలో ఉంది. కాగా, పండగ పూట ఇలా నిత్యావసర వస్తువుల ధరలు మండిపోవడంతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.